ఇండియాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3!

Posted By:

 ఇండియాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3!

 

సామ్‌సంగ్ అభిమానులను ఊరించి..ఉడికిస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ని నేడు భారత్‌లో విడుదల చేస్తున్నారు. ఫోన్ ఖచ్చితమైన ధరకు సంబంధించి సమాచారం లేదు. సంబంధిత వివరాలను విడుదల కార్యక్రమంలో సామ్‌సంగ్ ఇండియా వెల్లడించే అవకాశముంది. అంచనా ధర రూ.35,000. అత్యాధునిక మొబైలింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న గెలాక్సీ ఎస్3, ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్’కు గట్టి పోటీనివ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి నుంచి 26 దేశాల్లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో గెలాక్సీ ఎస్3ని లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ వర్గాలు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.

బుకింగ్ ద్వారా గెలాక్సీ ఎస్3ని దక్కించుకునే అవకాశాన్ని సామ్‌సంగ్ ఇండియా కల్పిస్తుంది. ఔత్సాహికులు సామ్‌సంగ్ ఈ-స్టోర్‌లోకి లాగినై సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యూరోప్, ఆసియా మార్కెట్ల నుంచి ఇప్పటికే 9 మిలియన్ల ముందస్తు ఆర్డర్లు దక్కించుకున్న గెలాక్సీ ఎస్3 భవిష్యత్‌లో ఏ విధమైన రికార్డులను నెలకొల్పుతుందో వేచి చూడాలి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 3, 2012న ఆవిష్కరించారు. బరవు 133 గ్రాములు. ధర అంచనా రూ.40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot