పడిన చోటే గెలుపు, గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు Galaxy Note 8దే !
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్ కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 'గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్' గా అవార్డు దక్కించుకుంది.
గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ నుంచి శాంసంగ్ ఎట్టకేలకు కోలుకుని మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 8ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పడిన చోటే పోయినది వెతుక్కోవాలి అనే నానుడిని నిజం చేస్తూ గెలాక్సీ నోట్ 8తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. వచ్చి రావడంతోనే రికార్డులు సృష్టించింది. ఆ ఫోన్‌తో యూజర్లు శాంసంగ్ పై తమ అభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు.
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్ కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 'గాడ్జెట్ ఆఫ్ ది ఇయర్' గా అవార్డు దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2017 లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ అవార్డను సొంతం చేసుకుంది.

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
ఇండస్ట్రీలోనే తొలి ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్).

ర్యామ్
6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం

కెమెరా
12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

బ్యాటరీ
3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్
డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్

హార్ట్ రేట్ మానిటర్
ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

ధర రూ. 67,000
మార్కెట్లో దీీని ధర రూ. 67,000. నోట్ 8 ప్రీ-ఆర్డర్‌పై ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని కూడా అమెజాన్ అందించనుంది.

4000 రూపాయల క్యాష్‌బ్యాక్
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులపై 4000 రూపాయల క్యాష్‌బ్యాక్, ఉచితంగా వైర్‌లెస్ ఛార్జర్, 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, 448జీబీ రిలయన్స్ జియో డేటాను అమెజాన్ ఆఫర్ చేయనుంది.


Click it and Unblock the Notifications