చిన్న పిల్లల కోసం స్పెషల్ ఫోన్ Easyfone Star
eNovus enterprises అనే కంపెనీ కేవలం చిన్న పిల్లల కోసమే ఈజీఫోన్ స్టార్ పేరిట ఓ ఫోన్‌ను విడుదల చేసింది. చిన్న పిల్లల కోసం భారత్‌లో విడుదలైన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.
eNovus enterprises అనే కంపెనీ కేవలం చిన్న పిల్లల కోసమే easyfone Star పేరిట ఓ ఫోన్‌ను విడుదల చేసింది. చిన్న పిల్లల కోసం భారత్‌లో విడుదలైన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో కేవలం నిర్దిష్టమైన ఫోన్ నంబర్లను మాత్రమే సేవ్ చేసుకునే సదుపాయం కల్పించారు. తల్లిదండ్రులు ఈ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లకే చిన్న పిల్లలు ఫోన్ చేసుకోగలుగుతారు. అయితే easyfone Star ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం లేదు.

ధర...
ఈ ఫోన్ 5 కలర్ వేరియెంట్లలో రూ.3,490 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

జీపీఎస్‌ను ఏర్పాటు..
ఈ ఫోన్ లో జీపీఎస్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ట్రాక్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో ఎస్‌వోఎస్ కీ ని ఏర్పాటు చేశారు.

అలారం, రిమైండర్స్....
ఇక ఈ ఫోన్‌లో అలారం, రిమైండర్స్ పెట్టుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల పిల్లలు తాము నిర్దిష్టమైన సమయంలో చేయాల్సిన పనిని రిమైండర్ ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు.


Click it and Unblock the Notifications