SpaceX కు కండీషన్ పెట్టిన భారత ప్రభుత్వం.. అంగీకరిస్తేనే అనుమతులు మంజూరు..?
భారత్ టెలికాం రంగంలో గత రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎయిర్‌టెల్, జియో సంస్థ ఎలాన్ మస్క్‌కు చెంది స్పేస్‌ఎక్స్ సంస్థతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల (Satellite internet Services) కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే జియో కూడా స్పేస్‌ఎక్స్ తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. స్పేస్‌ఎక్స్ (SpaceX) అనుబంధ సంస్థ స్టార్‌లింక్ (Starlink) ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది.
అయితే ఈ రెండు సంస్థలు తమ ప్రకటనల్లో భారత ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా మందుకెళ్తామని వెల్లడించాయి. అంటే స్పేస్‌ఎక్స్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

అయితే తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం కీలక షరతులు విధించినట్లు తెలుస్తోంది. వీటిపై నిర్ణయం తీసుకొంటేనే.. అనుమతుల విషయంలో ముందుకెళ్లామని చెప్పినట్లు తెలిసింది.
స్పేస్‌ఎక్స్ తమ కంట్రోల్ సెంటర్‌ను భారత్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం షరతు విధించినట్లు తెలుస్తోంది. ఏదైనా అత్యవసర సమయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసేందుకు దేశంలో కంట్రోల్ సెంటర్ అవసరం అని కేంద్ర ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.
ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తిన ప్రతిసారి ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసేందుకు అమెరికాలో ఉన్న స్పేస్‌ఎక్స్, స్టార్‌లింక్ ప్రధాన కార్యాలయాలను సంప్రదించడం సాధ్యంకాదని ప్రభుత్వం చెబుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో నిర్ణయం తీసుకోవడం సహా నియంత్రించేందుకు వీలుగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
భారత టెలికాం చట్టాల ప్రకారం ప్రజా భద్రత, అత్యవసర పరిస్థితులు, విపత్తులు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టెలికాం సేవలను నిలిపివేసే అధికారం ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు చట్టాలల్లో స్పష్టంగా ఉన్నాయి. దీని ఆధారంగానే ప్రస్తుతం టెలికాం సంస్థలు పనిచేస్తున్నాయి.
భారత్‌లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని స్టార్‌లింక్ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. భారత్‌లో స్పేస్‌ఎక్స్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతుల కోసం స్పేస్‌ఎక్స్ దరఖాస్తు ప్రస్తుతం చివరి ధరలో ఉన్నట్లు తెలుస్తోంది.
స్పేస్‌ఎక్స్ ప్రస్తుతం సుమారు 100 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. ఇందుకోసం సుమారు లో ఎర్త్ ఆర్బిట్ (LEO) 6000 ఉహగ్రహాలను కలిగి ఉంది. భూమికి సుమారు 550 కిమీ ఎత్తులో తిరుగుతూ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ డౌన్‌లోడ్ స్పీడ్ 25-220 Mbps గా ఉంది. అదే అప్‌లోడ్ స్పీడ్ 40 Mbps గా ఉంటుందని తెలుస్తోంది. ప్రీమియం ప్యాకేజీలను కలిగి ఉన్న యూజర్లు 500 Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








