ఫ్రీకాల్, ఆఫ్‌లైన్ వాయిస్ కాలింగ్ సర్వీస్!

Posted By:

బెంగుళూరుకు చెందిన ముగ్గరు ఇంజనీరింగ్ విద్యార్థులు ‘ఫ్రీకాల్'( FreeKall) పేరుతో ఆఫ్‌లైన్ వాయిస్ కాలింగ్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఉచిత వాయిస్ కాలింగ్ సర్వీసును ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ రూపకల్పనలో బెంగుళూరుకు చెందిన యువ ఇంజినీర్లు యషస్ సీ శేఖర్, యూ. విజయకుమార్, ఇ.సందేశ్‌లు కీలక పాత్ర పోషించారు.

దేశమంతా ‘ఫ్రీకాల్’!

ఫ్రీకాల్ సర్వీసును ఏలా ఉపయోగించుకోవాలి..?

ఫ్రీకాల్ సర్వీసులను ఉపయోగించుకోవాలనకునే వారు ముందుగా తమ మొబైల్ ఫోన్ నుంచి ఫ్రీకాల్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వాలి.( ఫ్రీకల్ కాల్ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 080-67683693, 080-67683693) .

కొద్ది సెకన్లు తరువాత అదే నంబర్ నుంచి మీ మొబైల్ నంబర్‌కు కాల్ వస్తుంది. ఆ సమయంలో మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి ఫోన్ నంబర్‌ను జతచేసి డయల్ చేస్తే ఆ నంబర్‌కు ఫ్రీకాల్ ద్వారా కాల్ కనెక్ట్ అవుతుంది. ఫ్రీకాల్ మాట్లాడే సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి 10 సెకన్ల నిడివిగల వాణిజ్య ప్రకటనలను ఆడియో రూపంలో మీకు వినిపించబడతాయి.

ఈ యాడ్‌లను ప్రసారం చేసినందుకు గాను ఆయా కంపెనీలు ఫ్రీకాల్ సంస్థకు డబ్బు చెల్లిస్తాయి. ఫ్రీకాల్ సర్వీసులో సభ్యత్వం తీసుకున్న వారు ఒక రోజులో 12 నిమిషాలు పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఆ 12 నిమిషాల వ్యవధిలో దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఫ్రీకాల్ చేసుకోవచ్చు. ఈ సర్వీసును ఉపయోగించుకోవాలనుకుంటున్న ఔత్సాహికులు www.freekall.coలోకి లాగినై తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot