గెలిస్తే 76వేలు మీ సొంతం: ఏప్రిల్ ఫూల్ అయితే కాదు!

Posted By: Staff

గెలిస్తే 76వేలు మీ సొంతం: ఏప్రిల్ ఫూల్ అయితే కాదు!

 

మీ ప్రతిభ చూపి అక్షరాలా 76వేలు గెలుచుకునే సువర్ణ అవకాశం.. మీలో మీకు తెలియని రెండో మనిషిని నిద్రలేపే సత్తాచాటే గొప్ప ఛాన్స్ మిస్ కావద్దు. నోకియా మరియు ఆడియో డ్రాఫ్ట్ సంస్థలు సంయుక్తం ఆధ్వర్యంలో ఉత్తమ రింగ్‌టోన్ కాంటెస్ట్‌ను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో ఎంపికైన ఉత్తమ రింగ్‌‌టోన్‌లకు రూ.76,000 చొప్పున నజరానా అందించనున్నారు. అంతేకాదండోయ్ పోటీలో నెగ్గిన రింగ్‌టోన్ కొన్ని మిలియన్ల హ్యాండ్‌సెట్‌లలో ఇన్‌బుల్ట్ చేయబడుతుంది.

ఈ తరహా పోటీలను కేవలం ఇండియాలోనే కాకుండా చైనా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా ఫెసిఫిక్, సౌత్ ఈస్ట్ ఆసియా మరియు లాటిన్ అమెరికా ప్రాంతాల్లో నోకియా నిర్వహిస్తుంది. పోటీలో భాగంగా ఔత్సాహికుల పంపిన రింగ్‌టోన్‌లను నోకియా సౌండ్ డిజైన్ టీమ్ పరిశీలించి వాటిలో విజేతలను ప్రకటిస్తుంది. ఔత్సాహికులు ఎంపిక చేసుకునే రింగ్‌టోన్‌లు శాస్త్ర్రీయ, సాంప్రదాయ, జానపద మరియు ఆధునిక ధృక్పదంలో ఉండాలి. ఎంట్రీలు ఈ నెల 17 వరకు స్వాగతింబడతాయి. విజేతలను 24న ప్రకటిస్తారు. పూర్తి వివరాలు కోసం ఆడియో డ్రాఫ్ట్ సైట్‌లోకి లాగిన్ కాగలరు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting