ఐఫోన్5 ముందస్తుగా బుకింగ్‌లు ప్రారంభం!

ఆపిల్ ఇండియా, ఐఫోన్5ను ఈ నెల 26ను దేశీయ విపణిలో ఆవిష్కరించనుంది. నవంబర్ మొదటి వారం నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ (Infibeam) ఐఫోన్5 ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ఔత్సాహికులు ముందస్తుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 16జీబి వర్షన్ మోడల్‌కు మాత్రమే ప్రీబుకింగ్ అనుమతిస్తుంది. బుక్ చేసుకున్న రెండు, మూడు రోజుల్లో డెలివరీ ఉంటుంది.
Infibeam.com లింక్ అడ్రస్: http://www.infibeam.com/Mobiles/i-Apple-iPhone-5-16GB-Smartphone/P-E-M-Apple-iPhone-5-16GB.html
ఆఫిల్ ఐఫోన్5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.


Click it and Unblock the Notifications








