లవ్ గుర్తుతో పాటు ఆఫర్లతో Vivo V7 Plus, ప్రేమికులకు గిఫ్ట్‌గా..

వివో సంస్థ తన వీ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌ను షాంపేన్ గోల్డ్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో అప్పట్లో లాంచ్ చేసింది.

By Hazarath
|

వివో సంస్థ తన వీ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌ను షాంపేన్ గోల్డ్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో అప్పట్లో లాంచ్ చేసింది. తరువాత ఈ ఫోన్‌కు చెందిన ఎనర్జిటిక్ బ్లూ కలర్ వేరియెంట్‌ను విడుదల చేసింది. ఇక తాజాగా ఇదే ఫోన్‌కు చెందిన ఇన్ఫినిట్ రెడ్ కలర్ వేరియెంట్‌ను లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది. వి7 ప్లస్‌లో స్పెషల్‌ ఎడిషన్‌ను వాలెండైన్స్‌ కానుకగా యూజర్లకు అందిస్తోంది.

 

ట్రంప్ చేతిలో ఐఫోన్, ఆ ఒక్క దాని కోసమేనట !ట్రంప్ చేతిలో ఐఫోన్, ఆ ఒక్క దాని కోసమేనట !

గుండె ఆకారంలో ఉన్న స్పెషల్‌ డిజైన్‌..

గుండె ఆకారంలో ఉన్న స్పెషల్‌ డిజైన్‌..

వాలెంటైన్స్ డే కానుక‌గా ప్రేమికుల కోసం ఈ డివైస్‌ వెనుక గుండె ఆకారంలో ఉన్న స్పెషల్‌ డిజైన్‌ ముద్రించి మరీ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసింది. ప్రముఖ ఫ్యాషన్‌​ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాతో భాగస్వామ‍్యం తో వివో 7 ప్లస్‌ ఇన్ఫినిట్ రెడ్ కలర్ వేరియెంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ధర

ధర

దీని ధరను కంపెనీ రూ. 22, 990గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అమెజాన్‌ ద్వారా అన్ని ఆన్‌లైన్‌ స్టోర్లలో ఇది ప్రత్యేకంగా లభ్యం కానుందని వివో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో గతంలో వచ్చిన వివో వీ7 ప్లస్ ఫీచర్లే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు.

 వివో వీ7 ప్లస్ ఫీచర్లు
 

వివో వీ7 ప్లస్ ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

లాంచింగ్‌ ఆఫర్లు

లాంచింగ్‌ ఆఫర్లు

రూ.500 విలువచేసే బుక్‌ మై షో , ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ కూపన్లు, ఎక్సేంజ్‌ ద్వారా రూ.3వేల దాకా తగ్గింపును అందిస్తోంది.

Best Mobiles in India

English summary
Infinite Red Vivo V7 Plus limited edition smartphone launched in India for Rs 22,990 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X