108MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
ఇన్ఫినిక్స్ నుంచి గత వారం GT 20 ప్రో స్మార్ట్ ఫోన్ (Infinix GT 20 Pro Smartphone sale is Live) భారత్ లో లాంచ్ అయింది. ఈ హ్యాండ్ సెట్ ఇవాళ్టి నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన గేమింగ్ చిప్ సెట్ సహా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మెకా బ్లూ, మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్ల ద్వారా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz, 120Hz, 144Hz రీఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2304hz PWM ఫ్రీక్వెన్సీ ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. మరియు Pixelworks X5 టర్బో గేమింగ్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS14 OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ VC కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ సహా ఇతర సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 108MP శాంసంగ్ HM6 కెమెరాను కలిగి ఉంది. మరియు 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
5000mAh బ్యాటరీ సహా 256GB స్టోరేజీ :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఇన్ఫినిక్స్ GT 20 ప్రో సేల్, ధర : ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. ICICI, SBI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ.5499 విలువైన గేమింగ్ కిట్‌ను ఉచితంగా పొందవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వైఫై 802.11, బ్లూటూత్, FM రేడియో, GPS, USB-C, OTG, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు లైట్ సెన్సార్, ఈ-కాంపాస్, G-సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్ JBL స్పీకర్‌లు సహా భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో లాంచ్ అయింది.


Click it and Unblock the Notifications








