Home
Mobile

108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. టీజర్‌ విడుదల... పూర్తి వివరాలు..!!

ఇన్ఫినిక్స్ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల కానుంది. ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (infinix GT 20 Pro Smartphone) టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ విడుదలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే గత వారం సౌదీ అరేబియాలో ఈ హ్యాండ్‌సెట్ విడుదల అయింది. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

టీజర్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్‌ కు (infinix Upcoming Smartphone) సంబంధించిన పరికరాలను కలిగి ఉంటుంది. ‌స్మార్ట్‌ఫోన్‌తో పాటు కూలింగ్ ఫ్యాన్‌, గేమింగ్‌ మౌస్‌ మరియు ఇతర పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.

infinix GT 20 Pro Smartphone teased

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్పెసిఫికేషన్లు :
ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 144Hz అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిట్లు తెలుస్తోంది. సైబర్‌ మెకా డిజైన్ మరియు లూప్‌ LED ఇంటర్‌ఫేస్‌ తో 8 రంగుల్లో మరియు నాలుగు లైటింగ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ కొత్త హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మీడియా డైమెన్సిటీ 8200 అల్టిమేట్‌ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. Mail G610 GPU మరియు Pixelworks X5 టర్బో గేమింగ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్‌ కానుంది.

ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ భద్రత కోసం ఇన్‌- డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెస్టిస్టెంట్‌గా వస్తుంది. మరియు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్ల పరంగాను మెరుగైన కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో హ్యాండ్‌సెట్ కెమెరాల పరంగా మెరుగైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) OIS సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు మిలిగిన కెమెరాల వివరాల తెలియాల్సి ఉండగా.. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర పై సంస్థ ఎటువంటి స్పష్టత లేకపోయినా.. రూ.40,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల సహా ఇతర వివరాలు కొన్నింటిని సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix GT 20 Pro Smartphone teased may debut in india soon key specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X