Home
Mobile

6.78 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో స్మార్ట్‌ఫోన్‌.. రేపే విడుదల..!!

ఇన్ఫినిక్స్ నుంచి రేపు (మే 21వ తేదీ) కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. కొన్ని వారాల ముందు ఈ సంస్థ నుంచి ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో హ్యాండ్‌సెట్‌ (infinix GT 20 Pro Smartphone) విడుదల అయింది. భారత్‌ మార్కెట్‌లోకి రేపు ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఈ ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 అల్టిమేట్‌ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 12GB LPDDR5x ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీ తో వస్తుంది. హై ఫ్రేమ్‌ రేట్‌ మరియు SDR నుంచి HDR కు మారేందుకు గేమింగ్‌ చిప్‌లను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.

infinix GT 20 Pro smartphone will be launching in india

ఈ హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. క్లీన్‌ మరియు మెరుగైన సాఫ్ట్‌వేర్‌ అనుభూతిని పొందవచ్చని ఇన్ఫినిక్స్‌ సంస్థ పేర్కొంది. దీంతోపాటు రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ చెబుతోంది.

గ్లోబెల్‌ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 10 bit పుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ JBL స్పీకర్లను కలిగి ఉంటుంది.

infinix GT 20 Pro smartphone will be launching in india

ఈ ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 45W ఛార్జింగ్‌ పోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫోన్‌ వినియోగిస్తున్న సమయంలో వేడెక్కకుండా ఉండేందుకు VC కూలింగ్‌ ఛాంబర్‌ టెక్నాలజీతో వస్తుంది. ఫలితంగా ఫోన్ ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సైబర్‌ మెకా డిజైన్‌తో లాంచ్ కానుంది. 8 కలర్‌ కాంబినేషన్‌లతో LED ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటుంది. ఈ లైటింగ్‌ ఎఫెక్ట్‌లను కస్టమైజ్ చేయవచ్చు. మిడ్ రేంజ్‌ ధరలో గేమింగ్‌ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేస్తోంది.

ఇన్ఫినిక్స్‌ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తోపాటు బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ ఇన్ఫినిట్స్‌ GT బుక్‌ ల్యాప్‌టాప్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 16 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు RGB లైట్‌ సెటప్‌ తో వస్తుంది. మెటల్‌ బాడీని కలిగి ఉంటుంది.

ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఇంటెల్‌ కోర్‌ i9 13th జెన్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు Nvidia GeForce RTX4060 తో జతచేయబడుతుంది. దీంతోపాటు కోర్ i5 13th జెన్‌ GeForce RTX4050 మరియు కోర్‌ i5 12th జెన్‌ ప్రాసెసర్‌తో Nvidia GeForce RTX3050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix GT 20 Pro smartphone to launch on tomorrow in india here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X