బడ్జెట్ ధరలో 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, ప్రత్యేక గేమింగ్ ఫీచర్‌లతో 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు!
Infinix GT 30 5G+ Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇన్ఫినిక్స్ GT 30 5G+ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. అల్ట్రాలింక్ ఫీచర్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ఇన్ఫినిక్స్ GT 30 5G+ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2304Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ తెలిపింది.
64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇందులో 64MP సోనీIMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు మెకా లైట్ LED యూనిట్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన బటన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ బటన్స్‌ను కెమెరా, వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్ కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 90FPS BGMI ను సపోర్టు చేస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. దీంతోపాటు ఇ-స్పోర్ట్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది.
వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ :
ఈ ఫోన్ Folax AI వాయిస్ అసిస్టెంట్, AI నోట్, AI గ్యాలరీ, AI రైటింగ్ అసిస్టెంట్, సర్కిల్ టూ సెర్చ్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 లేయర్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR ను సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ అల్ట్రాలింక్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. అంటే బలహీనమైన నెట్‌వర్క్ కవరేజీ సహా నెట్‌వర్క్ పూర్తిగా లేని చోట్ల కూడా కాల్స్ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఫోన్‌ల మధ్య మాత్రమే టెక్నాలజీని ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ GT 30 5G+ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. ఈ ఫోన్ సేల్ ఆగస్టు 14 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సైబర్ గ్రీన్, పల్స్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. తొలిసేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








