Home
Mobile

64MP కెమెరా, గేమింగ్‌ ఫీచర్లు, రివర్స్ ఛార్జింగ్‌, 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌..!

infinix GT 30 5G+ Smartphone Sale : భారత్‌ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ GT 30 5G+ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ 64MP ప్రైమరీ కెమెరాతోపాటు గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు.

ఇవాళ్టి నుంచే సేల్ :
ఇన్ఫినిక్స్‌ GT 30 5G+ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,499, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

infinix GT 30 5G  smartphone sale

ఫ్లిప్‌కార్ట్ పేజీ ఆధారంగా ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను ICICI బ్యాంకు కార్డులపై రూ.1500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సైబర్‌ గ్రీన్‌, పల్స్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. దీంతోపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలకు కూడా పొందవచ్చు.

డిస్‌ప్లే వివరాలు :
ఇన్ఫినిక్స్‌ GT 30 5G+ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. మరియు 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ ఇ-స్పోర్ట్స్ మోడ్‌ను కలిగి ఉంది. మరియు 90FPS BGMI ను సపోర్టు చేస్తుంది.

64MP కెమెరా, 5500mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు మెకా లైట్‌ LED ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్, 10W రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్‌ GT 30 5G+ స్మార్ట్‌ఫోన్ Folax AI వాయిస్‌ అసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో AI Note, AI Gallary, AI Writing Assistant, సర్కిల్ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ అల్ట్రాలింక్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్‌ చేసుకొనేందుకు అనుమతిస్తుంది. ఇన్ఫినిక్స్‌ టూ ఇన్ఫినిక్స్ మధ్య మాత్రమే ఈ అవకాశం ఉంది.

ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ 6 లేయర్‌ 3D వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ ప్రత్యేకమైన బటన్స్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix GT 30 5G+ smartphone sale to start from today via flipkart here is the bank deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X