Home
Mobile

108MP కెమెరా, 5500mAh బ్యాటరీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో 5G ఫోన్‌.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌!

Infinix GT 30 Pro 5G Sale : భారత్‌ మార్కెట్‌ లో ఈ నెల తొలి వారంలో ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంది. డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. తొలి కొనుగోలు చేసిన వారి ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌ ఇ-స్పోర్ట్స్‌ మోడ్, 3D వేపర్‌ కూలింగ్‌ వంటి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఇవాళ ఒక్కరోజు రూ.22999 కే కొనుగోలు చేయవచ్చు.

Infinix GT 30 Pro 5G Smartphone sale telugu news

ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ ను ఎక్స్చేంజీ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లేడ్‌ వైట్‌, డార్క్‌ ఫ్లేర్‌ కలర్‌ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. డ్యూయల్‌ స్పీకర్‌లు, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్‌ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌, 256GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 14 ను కలిగి ఉంది. గేమింగ్‌ వంటి మల్టీ టాస్కింగ్‌ సందర్భాల్లో ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు 6 లేయర్‌ VC కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది.

Infinix GT 30 Pro 5G Smartphone sale telugu news

దీంతోపాటు ఈ ఫోన్‌లో గేమింగ్‌కు అనుకూలంగా అనేక ఫీచర్‌లున్నాయి. ఈ ఫోన్‌ 120fps తో BGMI ను సపోర్టు చేస్తుంది మరియు ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌, XBoost గేమింగ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. వీటితోపాటు సర్కిల్ టూ సెర్చ్‌, AI Note, AI Writing Assistant వంటి ఫీచర్‌లున్నాయి.

ఈ హ్యాండ్‌సెట్‌ ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ Rheinland Low బ్లూ లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. మరియు ఈ డిస్‌ప్లే Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

Take a Poll

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ మరియు 10W వైర్‌, 5W వైర్‌లెస్‌ రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix GT 30 Pro 5G Smartphone sale is live in india, gets rs2000 Off on first day sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X