Home
Mobile

108MP కెమెరా, గేమింగ్‌ ఫీచర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు..!

infinix GT 30 Pro 5G Smartphone : భారత్ మార్కెట్‌ లో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం జూన్‌ లో విడుదల అయింది. ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు 108MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్‌, కూలింగ్‌ ఛాంబర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్‌ కోసం ఈ ఫోన్‌ లో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. మరియు ఈ ఫోన్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. రూ.25 వేల ధరలో గేమింగ్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

infinix GT 30 Pro 5G smartphone

అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే Always On Display గా ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

VC కూలింగ్‌ సిస్టమ్‌ :
ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్‌ XBoost గేమింగ్‌ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌ కూడా ఉంటుంది. మరియు 120fps తో BGMI ను సపోర్టు చేస్తుంది. గేమింగ్‌ సహా మల్టీ టాస్కింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు వీలుగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌ SoC చిప్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్‌, 256GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 14 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ సర్కిల్ టూ సెర్చ్‌ తో పాటు ఫోలెక్స్ ఏఐ అసిస్టెంట్‌, రైటింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు 45W వైర్‌ ఛార్జింగ్‌, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లు ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix GT 30 Pro 5G smartphone with 108MP camera and BGMI support available on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X