Home
Mobile

108MP కెమెరా, 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ తో 5G స్మా్ర్ట్‌ఫోన్‌ విడుదల..!

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకొనేలా ఉంది. మరియు 3D వేపర్ కూలింగ్‌ చాంబర్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఇ-స్పోర్ట్స్ మోడ్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో ఆల్‌వేస్‌ ఆన్‌ డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్‌లున్నాయి. ఈ ఫోన్‌ 5500mAh బ్యాటరీతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ (Infinix GT 30 Pro 5G Smartphone) 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 144Hz, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz ఇన్‌స్టంట్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2340 PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

Infinix GT 30 Pro 5G launch telugu news

ఈ డిస్‌ప్లే Always On Display ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు TUV Rheinland Low బ్లూ లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ డార్క్‌ ఫ్లేర్‌, బ్లేడ్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది. బ్లేడ్‌ వైట్‌ వేరియంట్ వైట్‌ LED లైట్‌ ప్యానల్‌, డార్క్ ఫ్లేర్‌ వేరియంట్‌ RGB LED లైట్‌ యూనిట్స్‌ ను కలిగి ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4nm ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌, 256GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 14 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్ పైన పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో గేమింగ్‌ కోసం ప్రత్యేక ఫీచర్‌లున్నాయి. XBoost గేమింగ్‌ ఇంజిన్‌, ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌ను కలిగి ఉంది. థర్మల్‌ మెనేజ్‌మెంట్‌ కోసం AI ఆధారిత VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 120fps తో BGMI ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ సర్కిల్ టూ సెర్చ్‌తోపాటు AI నోట్‌, రైటింగ్ అసిస్టెంట్‌, పోలెక్స్‌ వంటి AI ఫీచర్‌లున్నాయి.

Infinix GT 30 Pro 5G launch telugu news

5500mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌, 30W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 10W వైర్‌, 5W వైర్‌లెస్‌ రివర్స్‌ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

Take a Poll

ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది.

ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయిన తొలిరోజు 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.22999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ సేల్‌ జూన్ 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix GT 30 Pro 5G Smartphone with 108MP Camera and gaming features launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X