108MP కెమెరా, 5500mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ, ఫీచర్‌ల వివరాలు..!
ఇన్ఫినిక్స్ నుంచి భారత్ మార్కెట్‌లోకి మరో స్మా్ర్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. గత సంవత్సరం విడుదల అయిన ఇన్ఫినిక్స్ GT 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా ఇన్ఫినిక్స్ GT 30 ప్రో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు సహా ఇతర ఫీచర్‌ల వివరాలు ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫినిక్స్ ఈ హ్యాండ్‌సెట్స్ గురించి వెల్లడించింది.
ఎప్పుడు విడుదల కానుంది ? :
భారత్ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో స్మార్ట్‌ఫోన్ (infinix GT 30 Pro Smartphone) మే 21 వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో గేమింగ్ ఫీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సంస్థ తెలిపింది. ఇన్ఫినిక్స్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను వీక్షించవచ్చు.

ఇన్ఫినిక్స్ GT 30 ప్రో స్మార్ట్‌ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా ఇన్ఫినిక్స్ GT 30 ప్రో స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీ తో జతచేసి ఉంటుందని సమాచారం. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 (Skin) ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
108MP ప్రైమరీ కెమెరా! :
ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఫీచర్‌లను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
5500mAh బ్యాటరీ! :
బ్యాటరీ పరంగానూ ఇన్ఫినిక్స్ GT 30 Pro స్మార్ట్‌ఫోన్ బెస్ట్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 67W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌తోపాటు XPad GT గేమింగ్ ట్యాబ్లెట్, GT Buds ను కూడా లాంచ్ చేయనుంది. పైన తెలిపిన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు కొన్నింటిపై ఇన్ఫినిక్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ :
గత నెలలో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ రేంజ్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 ను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో 90fps ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది.
ఈ ఫోన్ 64MP సోనీ IMX682 కెమెరాతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








