5,000mAh బ్యాట‌రీతో Infinix నుంచి మ‌రో బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల‌..!

|

Infinix కంపెనీ భార‌త మార్కెట్లో త‌మ ఉత్ప‌త్తుల్ని క్ర‌మంగా విస్త‌రింప జేస్తోంది. ముఖ్యంగా బ‌డ్జెట్‌, మ‌రియు అఫ‌ర్డ‌బుల్ ఉత్ప‌త్తుల సెగ్‌మెంట్‌లో మ‌రింత దూకుడు పెంచింది. తాజాగా మ‌రో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేసింది. Infinix Hot 12 Pro పేరుతో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ ను భార‌త మార్కెట్లో బుధ‌వారం విడుద‌ల చేసింది. ఇది ఆండ్రాయిడ్ 12 OS తో Unisoc T616 చిప్‌సెట్ నుండి శక్తిని పొందుతుంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు, ధ‌ర‌లు మ‌రిన్ని వివ‌రాల‌ను కూడా తెలుసుకుందాం.

 
Infinix Hot 12 Pro

Infinix Hot 12 Pro స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో ప‌నిచేస్తుంది. అంతేకాకుండా, 180Hz ట‌చ్ సాంప్లింగ్ రేటుతో వ‌స్తోంది. డిజైన్ విషయానికి వస్తే, కొత్త ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ కటౌట్ డిజైన్‌లో ఇస్తున్నారు. Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్ Unisoc T616 చిప్‌సెట్‌తో వ‌స్తోంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజీ కలిగి ఉంటుంది. అద‌నంగా యూజ‌ర్లు 5జీబీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ ర్యామ్ ఎక్స్‌ప్యాండ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ఈ మొబైల్ ప‌నిచేస్తుంది.

 

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ క్వాలిటీ క‌లిగిన ప్రైమ‌రీ షూట‌ర్ లెన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. మ‌రో కెమెరా 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో డెప్త్ షాట్స్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. ఇక‌పోతే సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. బ్యాక్‌సైడ్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 5,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంది. ఇవే కాకుండా, Infinix Hot 12 Pro 4G, 3.5mm ఆడియో జాక్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS మొదలైన సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.

Infinix Hot 12 Pro

భార‌త్‌లో ఈ Infinix Hot 12 Pro ధ‌ర‌లు:
భారత మార్కెట్లో ఈ Infinix Hot 12 Pro స్మార్ట్ ఫోన్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. బేస్ వేరియంట్ 6GB + 64GB స్టోరేజీ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 గా నిర్ణ‌యించారు. టాప్ ఎండ్ వేరియంట్ 8GB + 128GB స్టోరేజీ మోడ‌ల్ ధ‌ర రూ.12,999 గా నిర్ణ‌యించారు. ఆగ‌స్టు 8వ తేదీ నుంచి ఈ మొబైల్ సేల్‌కు కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి రానుంది. యూజ‌ర్లు 8జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,999 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చ‌ని తెలుస్తోంది. కొత్త Infinix ఫోన్ Flipkartలో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారుల‌కు Lightsaber మరియు Electric Blue రంగుల్లో ల‌భించ‌నుంది.

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Infinix Hot 12 Play స్మార్ట్‌ఫోన్ ప్ర‌త్యేక‌త‌ల గురించి కూడా తెలుసుకుందాం.:
Infinix Hot 12 Play మొబైల్ 6,000 mAh గ‌ల బ్యాట‌రీతో పాటు ప‌లు మ‌రిన్ని ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లను ప‌రిశీలిద్దాం.

Infinix Hot 12 Pro

Infinix Hot 12 Play స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో ప‌నిచేస్తుంది. Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్ Octa-core 12nm UNISOC T610 ప్రాసెస‌ర్‌తో వ‌స్తోంది. ఇది 4/6GB RAM RAM మరియు 64GB, 128GB స్టోరేజీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ఈ మొబైల్ ప‌నిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. బ్యాక్‌సైడ్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇస్తున్నారు. ఇక ఛార్జ్ విష‌యానికొస్తే.. 6,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇవే కాకుండా,Infinix Hot 12 Play, ఛార్జింగ్ కోసం USB టైప్-C 2.0 పోర్ట్, Wi-Fi, బ్లూటూత్, GPS మొదలైన సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.

భార‌త్‌లో ఈ Infinix Hot 12 Play ధ‌ర‌లు:
భారత మార్కెట్లో ఈ Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ 4GB + 64GB స్టోరేజీ మోడ‌ల్ ధ‌ర రూ.9,850 గా అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Hot 12 Play మోడ‌ల్ 4GB + 64GB స్టోరేజీ హారిజాన్ బ్లూ క‌ల‌ర్ వేరియంట్ ధ‌ర రూ.8,999 కు కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Infinix Hot 12 Pro With Unisoc T1616 SoC, 90Hz Display Launched In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X