50MP కెమెరా, 16GB వరకు RAM తో Infinix కొత్త ఫోన్! ధర రూ.9999
Infinix గత సంవత్సరం లాంచ్ చేసిన HOT 30i కి సక్సెసర్‌గా హాట్ సిరీస్‌లో కంపెనీ యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయిన HOT 40i ని ఈ రోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మునుపటి మాదిరిగానే 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఇది పంచ్-హోల్‌తో వస్తుంది మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ హీలియో G37 తో పోలిస్తే యూనిసోక్ నుండి ఆక్టా-కోర్ T606 SoC ప్రాసెసర్ ని పొందుతుంది. ఇది 8GB ర్యామ్‌తో 8GB వర్చువల్ RAM, 256GB స్టోరేజీ, 50MP వెనుక కెమెరాతో పాటు AI లెన్స్ మరియు 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 40i రేడియంట్ గ్లో డిజైన్‌తో వస్తుంది, దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP53 రేటింగ్‌లను కలిగి ఉంది మరియు మ్యాజిక్ రింగ్ ఫేస్ అన్‌లాక్, బ్యాక్‌గ్రౌండ్ కాల్, ఛార్జింగ్ యానిమేషన్, ఛార్జ్ కంప్లీషన్ రిమైండర్ మరియు తక్కువ బ్యాటరీ రిమైండర్‌లను అందిస్తుంది. ఇది 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది.
Infinix HOT 40i స్పెసిఫికేషన్‌ల వివరాలు
ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల (1612 x 720 పిక్సెల్‌లు) HD+ స్క్రీన్ 480 నిట్స్ ప్రకాశం గల డిస్ప్లేయను కలిగి ఉంది. ఇది 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా కలిగి ఉంది.
ప్రాసెసర్ వివరాలు గమనిస్తే,1.6GHz ఆక్టా కోర్ యూనిసోక్ T606 (6x కార్టెక్స్-A55 మరియు 2x కార్టెక్స్-A75 కోర్లు) 12nm ప్రాసెసర్ విత్ మాలి G57 MP1 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR4X RAM (+ 8GB వర్చువల్ RAM), 236GB UFS 2.2 నిల్వ, 2TB వరకు విస్తరించదగిన స్టోరేజీ తో వస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 40i స్మార్ట్ ఫోన్ XOS 13 తో ఆండ్రాయిడ్ 13 తో పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD) స్లాట్ కలిగి ఉంది. ఇక కెమెరా వివరాలు గమనిస్తే, f/2.0 ఎపర్చరుతో 50MP వెనుక కెమెరా, AI లెన్స్, క్వాడ్ LED రింగ్ ఫ్లాష్, డ్యూయల్ LED ఫ్లాష్‌తో 32MP ఫ్రంట్ కెమెరా,
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది.
ఫోన్ యొక్క డిజైన్ కొలతలు గమనిస్తే ఇది 163.59×75.59×8.3mm పరిమాణం కలిగి ఉంటుంది. దీని బరువు: 190గ్రా గా ఉంటుంది. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, USB టైప్-C ,18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 40i ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలు
ఇన్ఫినిక్స్ హాట్ 40i స్టార్‌లిట్ బ్లాక్, పామ్ బ్లూ, హారిజోన్ గోల్డ్ మరియు స్టార్‌ఫాల్ గ్రీన్ రంగులలో వస్తుంది మరియు దీని ధర రూ. 9999 గా ఉంది. ఇది ఫిబ్రవరి 21 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో అదనంగా రూ.1000 ఎక్స్చేంజి తగ్గింపు ఆఫర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications