Home
Mobile

రూ.10వేల ధరలోనే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌, సేల్‌ వివరాలు..!

ఇన్ఫినిక్స్‌ సంస్థ ఇటీవల తన ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ ఇన్ఫినిక్స్ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ను (Infinix Hot 40i) త్వరలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ గత సంవత్సరం డిసెంబర్‌లోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ప్రస్తుతం భారత్‌లో లాంచ్‌ వివరాలను వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ (Infinix smartphones 2024) ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్‌ కానుంది. అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.10,000 సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంటుందని సమాచారం.

Infinix Hot 40i Smartphone launch date confirmed in india

అక్కడ రూ.8,300 బేస్‌ వేరియంట్‌ : గత డిసెంబర్‌లో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ సహా ఇన్ఫినిక్స్‌ Hot 40, ఇన్ఫినిక్స్‌ Hot 40 ప్రో హ్యాండ్‌సెట్‌లు కూడా అందుబాటులో వచ్చాయి. సౌదీ అరేబియాలో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర SAR 375 (భారత కరెన్సీలో సుమారుగా రూ.8,300) గా ఉంది.

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే వివరాలు : ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ గ్లోబల్‌ వేరియంట్‌ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వచ్చింది. మరియు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 60Hz నుంచి 90Hz వరకు రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. మరియు 480 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

Infinix Hot 40i Smartphone launch date confirmed in india

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్టోరేజీ వివరాలు : ఇన్ఫినిక్స్‌ హాట్‌ 40i స్మార్ట్‌ ఫోన్‌ Unisoc T606 SoC చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత కెమెరాలు : కెమెరాల పరంగా ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Infinix Hot 40i Smartphone launch date confirmed in india

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Infinix Hot 40i Smartphone launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X