Home
Mobile

ధర రూ.9499 కే అద్భుతమైన డిజైన్‌, 48MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్లో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ లకు మంచి డిమాండ్‌ ఉంది. ఫలితంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు రూ.10,000 ధర సెగ్మెంట్‌ పై దృష్టిసారిస్తున్నాయి. 4G ఫోన్‌లతోపాటు 5G హ్యాండ్‌సెట్‌లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ధర వివరాలు :
ఇన్ఫినిక్స్ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్ ( infinix Hot 50 5G Smartphone ) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 4GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.9,999, 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.

Infinix Hot 50 5G smartphone telugu news

డిస్కౌంట్ ఆఫర్లు :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో ( Flipkart ) ఈ ఫోన్‌ను రూ.9,499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ ను పొందవచ్చు. మరియు వివిధ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1,200 తగ్గింపును పొందవచ్చు.

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం డిజైన్‌ ను కలిగి ఉంది. 6.7 అంగుళాల ( 1600*720 పిక్సల్స్‌ ) HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కలిగి ఉంది.

Infinix Hot 50 5G smartphone telugu news

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ Mail G57 MC2 GPU మరియు 8GB LPDDR4X ర్యా్‌మ్‌, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 OS ను కలిగి ఉంది.

స్టోరేజీ, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఇన్ఫినిక్స్ 5G ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరాతోపాటు మరో AI డెప్త్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది.

కలర్‌ వేరియంట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ను అమర్చి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 802.11, GPS వంటి ఫీచర్‌ లను కలిగి ఉన్నాయి. వైబ్రంట్‌ బ్లూ, స్లీక్‌ బ్లాక్‌, సేజ్‌ గ్రీన్‌ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 50 5G smartphone gets best price on flipkart here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X