ధర రూ.9999 కే 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్మార్ట్‌ఫోన్ విడుదల.. సేల్ వివరాలు!
ఇన్ఫినిక్స్ సంస్థ భారత్‌లో రూ.10,000 కంటే తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5G హ్యాండ్‌సెట్ (Infinix Hot 50 5G Smartphone launched) ఆకట్టుకొనే డిజైన్ సహా అనేక మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరాతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. సేల్ ఆఫర్లను కూడా సంస్థ విడుదల చేసింది. బ్యాంకు ఆఫర్లతో కలిగి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.8999 గా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. భద్రత పరంగా ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.

ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ (Infinix Smartphone) ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5 OS పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 Soc చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. Arm Mail G57 MC2 GPU చిప్‌సెట్, 8GB LPDDR4x ర్యామ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
5000mAh బ్యాటరీ :
ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 4G, 5G, GPS, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఫీచర్లను కలిగి ఉంటుంది.

48MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఇన్ఫినిక్స్ హాట్ 50 5G 48MP సోనీ IMX582 కెమెరాను కలిగి ఉంటుంది. f/2.4 అపేచర్‌తో మరో AI కెమెరాను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాతో విడుదల అయింది.
స్మార్ట్‌ఫోన్ ధర, బ్యాంకు ఆఫర్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.8999 గా ఉంటుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ సేల్ వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ బ్లూ, స్లీక్ బ్లాక్, సేజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని సంస్థ వెల్లడించింది.


Click it and Unblock the Notifications