Home
Mobile

మంచి కలర్‌, డిజైన్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా.. రూ.9499 కే 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఫోన్‌..!

infinix Hot 50 5G Smartphone : భారత్‌ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ హాట్‌ 60 5G+ స్మార్ట్‌ఫోన్ జులై 11 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ప్రస్తుతం ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ.10 వేల ధర రేంజ్‌లో మీరు 5G ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తే ఈ ఫోన్ మీకు అనువుగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ డ్రీమీ పర్పుల్‌, సేజ్‌ గ్రీన్, వైబ్రంట్‌ బ్లూ, స్లీక్‌ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

infinix Hot 50 5G Smartphone

రూ.9499 ధరకే 5G ఫోన్‌ :
ఇన్ఫినిక్స్ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ విడుదల సమయంలో ధర రూ.9999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర విడుదల సమయంలో రూ.10,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్స్‌ను వరుసగా రూ.9499, రూ.10499 కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ప్రాసెసర్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ హాట్‌ 50 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 Soc ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. మరియు Mail G57 MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4X ర్యా్‌మ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14.5 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెండు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌తోపాటు మూడు సంవత్సరంల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, AI డెప్త్‌ సెన్సార్‌, LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

* జులై 11 న భారత్ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 60 5G+ ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ స్లీక్‌ బ్లాక్‌, షాడో బ్లూ, టండ్రా గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ ట్యాప్‌ AI బటన్‌ తో లాంచ్ కానుంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ HyperEngine 5.0 లైట్‌ గేమింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. 90fps గేమింగ్ సపోర్టు చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix Hot 50 5G Smartphone now available at RS9499 on flipkart, features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X