రూ.8999 కే 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం..!
ఇన్ఫినిక్స్ నుంచి ఇటీవల ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం (Infinix Hot 50 5G Smartphone Sale) అయింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 48MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.8999 గా ఉంటుంది. వైబ్రంట్ బ్లూ, స్లీక్ బ్లాక్, సేజ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7.8mm అంగుళాల సన్నని డిజైన్‌తో అందుబాటులో ఉంది. డ్రీమీ పర్పుల్ కలర్‌తో వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 Soc చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Arm Mail G57 MC2 GPU చిప్‌సెట్, 8GB LPDDR4X ర్యా్‌మ్ మరియు 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5 OS ను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. కెమెరా విభాగం పరంగా 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, f/2.4 అపేచర్‌తో మరో AI కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ సహా ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 4G, 5G, GPS, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi ఫీచర్లను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications