రూ.12 వేల ధర రేంజ్‌లో 50MP కెమెరా, AI బటన్, ప్రత్యేక గేమింగ్ ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్!
ఇన్ఫినిక్స్ నుంచి భారత్ మార్కెట్‌లోకి నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. 6500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే గత సంవత్సరం విడుదల అయిన ఇన్ఫినిక్స్ హాట్ 60 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం రూ.12 వేల ధర రేంజ్ లో అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ (Infinix Hot 60 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కారామెల్, షాడో బ్లూ, స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌సెన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.
ఆండ్రాయిడ్ 15 OS, కస్టమైజ్ AI బటన్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6GB LPDDR5x ర్యామ్, 128GB స్టోరేజీను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. కస్టమైజ్ AI బటన్ ను కలిగి ఉంది. ఈ AI బటన్ తో 30 యాప్స్ వరకు వినియోగించుకోవచ్చు.

గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ XBoost AI గేమ్ మోడ్, HyperEngine 5.0 Lite గేమింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఫోన్ 90fps ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్ టు సెర్చ్, AI Writing Assistant, AI Call Assistant వంటి ఫీచర్లు ఉన్నాయి.
అల్ట్రాలింక్ :
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ అల్ట్రాలింక్ ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి, నెట్‌వర్క్ కవరేజీ సక్రమంగా లేదా పూర్తిగా లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇన్ఫినిక్స్ ఫోన్‌ల మధ్య మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
50MP కెమెరా, 5200mAh బ్యాటరీ :
కెమెరా విభాగం ఈ ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ప్రధానంగా 50MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ రివర్స్, బైపాస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








