ఆకట్టుకొనే డిజైన్, గేమింగ్ ఫీచర్లు, వన్ ట్యాప్ AI బటన్‌తో 5G ఫోన్.. మీడియాటెక్ చిప్‌సెట్ సహా ఎన్నో ఫీచర్
Infinix Hot 60 5G+ Smartphone : ఇన్ఫినిక్స్ సంస్థ భారత్ మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ పేరుతో లాంచ్ కానుంది. రోజువారీ పనులను సులభం చేయడంతోపాటు, యూజర్ల అనుభూతిని మెరుగుపరిచేందుకు వీలుగా ఈ ఫోన్ వన్ ట్యాప్ AI బటన్ ను కలిగి ఉంటుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. తాజాగా ఈ ఫోన్ విడుదల తేదీ వెల్లడయింది.
ఎప్పుడు విడుదల కానుంది :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో జులై 11 వ తేదీన విడుదల కానుంది. విడుదల అనంతరం ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకమైన మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రారంభించింది. ఈ ఫోన్ 7.8mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

వన్ ట్యాప్ AI బటన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ వన్ ట్యాప్ AI బటన్ తో లాంచ్ కానుంది. ఈ బటన్ డ్యూయల్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. అంటే Long Press లేదా Double Press ఆప్షన్ల ద్వారా 30 కి పైగా యాప్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి AI అసిస్టెంట్ Folax ను యాక్టివేట్ చేయవచ్చు.
చిప్‌సెట్ :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR5X ర్యామ్‌తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ HyperEngine 5.0 లైట్ గేమింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. మరియు 90fps గేమింగ్ సపోర్టుతో లాంచ్ కానుంది. స్లీక్ బ్లాక్, షాడో బ్లూ, టండ్రా గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరిన్ని వివరాలు జులై 9 న వెల్లడిస్తామని ఇన్ఫినిక్స్ తెలిపింది.

* భారత్ మార్కెట్‌లో గత నెలలో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ అనేక AI ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఇ-స్పోర్ట్స్ మోడ్, 3D వేపర్ కూలింగ్ వంటి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బ్లేడ్ వైట్, డార్క్ ఫ్లేర్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 14 ను కలిగి ఉంది.
ఈ ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 6 లేయర్ VC కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120fps తో BGMI ను సపోర్టు చేస్తుంది. సర్కిల్ టూ సెర్చ్, AI Note, AI Writing Assistant వంటి AI ఫీచర్‌లున్నాయి. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు, 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








