Home
Mobile

రూ.10499 కే 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ప్రత్యేకమైన AI బటన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌..!

infinix Hot 60 5G+ Smartphone : ఇన్ఫినిక్స్ నుంచి ఇవాళ భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్లో 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఇన్ఫినిక్స్‌ హాట్‌ 60 5G+ ఫోన్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బటన్‌ను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఇన్ఫినిక్స్‌ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 700 నిట్స్‌ పీక్ బ్రైట్‌సెన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

infinix Hot 60 5G  Smartphone launched

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6GB LPDDR45x ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. 6GB/128GB స్టోరేజీ వేరియంట్స్‌లోనే అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యేకమైన AI బటన్‌ :
ఈ ఫోన్ కస్టమైజ్ AI బటన్‌ను కలిగి ఉంది. ఈ AI బటన్‌ ద్వారా 30 యాప్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ బటన్‌ను Long Press చేయడం ద్వారా ఇన్ఫినిక్స్ AI వాయిస్‌ అసిస్టెంట్‌ Folax ను యాక్టివేట్‌ చేయవచ్చు. ఈ ఫోన్ AI రైటింగ్‌ అసిస్టెంట్‌, AI కాల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది.

infinix Hot 60 5G  Smartphone launched

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఇన్ఫినిక్స్ హాట్‌ 60 5G+ స్మార్ట్‌ఫోన్‌ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా సూపర్‌ నైట్‌, స్కై షాప్‌, స్లో మోషన్‌, బ్యూటీ పొర్ట్రెయిట్స్‌ వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్‌ మోడ్‌ వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 18W ఛార్జింగ్‌ సపోర్టు, బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టు, రివర్స్‌ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 90fps గేమింగ్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు XBoost AI గేమ్‌ మోడ్‌తోపాటు HyperEngine 5.0 Lite గేమింగ్‌ టెక్నాలజీని కూడా సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కలిగి ఉంది. అల్ట్రాలింక్‌ కనెక్టివిటీ ఫీచర్‌తో బలహీనమైన నెట్‌వర్క్‌ లేదా పూర్తిగా నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లోనూ కాలింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ ద్వారా ఇన్ఫినిక్స్‌ టూ ఇన్ఫినిక్స్ ఫోన్‌ల కాలింగ్‌ మాత్రమే అవకాశం ఉంది.

Take a Poll

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 60 5G+ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ఆప్షన్‌ ధర రూ.10499 గా ఉంది. జులై 17 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ షాడో బ్లూ, స్లీక్‌ బ్లాక్‌, టండ్ర గ్రీన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. తొలిసేల్‌లో బ్యాంకు ఆఫర్లతో రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix Hot 60 5G+ Smartphone launched with AI button and IP64 Rating in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X