రూ.9749 ధరకు 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, AI బటన్‌తో 5G స్మార్ట్‌ఫోన్..!
ఇన్ఫినిక్స్ ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తోంది. ఎంట్రీ లెవల్, బడ్జెట్ ధరలోనూ ఆకట్టుకొనే ఫీచర్‌లతో వివిధ మోడల్స్‌ను తీసుకొస్తోంది. ఇటీవలే ఇన్ఫినిక్స్ GT 30 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సేల్ కూడా ప్రారంభం అయింది. గత నెలలో విడుదల చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ ను (Infinix Hot 60 5G+ Smartphone) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10499 గా ఉంది. ఈ ఫోన్‌ను ICICI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.9749 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 700 నిట్స్ పీక్ బ్రైట్‌సెన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కారామెల్ గ్లే, షాడో బ్లూ, స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్‌లోని అల్ట్రాలింక్ కనెక్టివిటీ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేని ప్రాంతాల నుంచి ఈ ఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ టూ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మాత్రమే ఈ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు కస్టమైజ్ AI బటన్‌ను కలిగి ఉంది. ఈ AI బటన్ ద్వారా 30 యాప్స్ వరకు ఉపయోగించుకోవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR5x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ XBoost AI గేమ్ మోడ్, HyperEngine 5.0 Lite గేమింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. 90fps గేమింగ్‌ను సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు అనేక కెమెరా ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్, AI రైటింగ్ అసిస్టెంట్, AI కాల్ అసిస్టెంట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 18W ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
* ఇటీవల విడుదల అయిన ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9299 గా ఉంది. ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 5.1 పైన పనిచేస్తుంది.
50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. Folax AI అసిస్టెంట్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. షాడో బ్లూ, మాన్‌సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








