Home
Mobile

రూ.11499 ధరకు 50MP కెమెరా, అల్ట్రాలింక్‌ ఫీచర్‌, AI బటన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌!

Infinix Hot 60 5G Smartphone : భారత్‌ మార్కెట్‌లో బడ్జెట్‌ ధరలో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫినిక్స్‌ సంస్థ ఈ సంవత్సరం వివిధ ఫోన్‌లను లాంచ్ చేసింది. జులై నెలలో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 60 5G+ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు HD+ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

రూ.11499 ధరకే :
ఇన్ఫినిక్స్‌ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌, ఇన్ఫినిక్స్‌ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Infinix Hot 60 5G Smartphone

HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్ :
ఇన్ఫినిక్స్‌ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 700 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌సెన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ షాడో బ్లూ, టండ్ర గ్రీన్‌, కారమెల్‌ గ్లో కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఏఐ బటన్‌ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 6GB LPDDR45x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఏఐ బటన్‌ను కలిగి ఉంది. ఈ బటన్ ద్వారా అనేక యాప్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది.

అల్ట్రాలింక్‌ ఫీచర్‌ :
ఈ ఫోన్‌లో అల్ట్రాలింక్‌ ఫీచర్‌ ఉంది. ఈ ఫీచర్‌తో బలహీనమైన నెట్‌వర్క్‌ లేదా పూర్తిగా నెట్‌వర్క్‌ కవరేజీ లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్‌తో కాలింగ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. ఈ ఫోన్‌ AI వాయిస్‌ అసిస్టెంట్‌ Folax ను కూడా కలిగి ఉంది.

Infinix Hot 60 5G Smartphone

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ మోడల్‌ వీడియో రికార్డింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు Super Night, Slow Motion, Beauty Portrairt వంటి ఫీచర్లను కలిగి ఉంది.

రివర్స్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ :
ఇన్ఫినిక్స్ హాట్‌ 60 5G స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ బైపాస్‌ ఛార్జింగ్, రివర్స్‌ వైర్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సర్కిల్‌ టు సెర్చ్‌, ఏఐ కాల్‌ అసిస్టెంట్‌, ఏఐ రైటింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గేమింగ్ ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ XBoost AI గేమ్‌ మోడ్‌, హైపర్‌ ఇంజన్ 5.0 లైట్‌ గేమింగ్‌ టెక్నాలజీని కూడా ఉంది. ఈ ఫోన్‌ 90fps ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 60 5G Smartphone with ultralink, AI button now available at Rs11499 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X