రూ.10 వేల ధరలో మరో స్మార్ట్‌ఫోన్.. AI ఫీచర్లు, 50MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
Infinix Hot 60i 5G Smartphone : ఇన్ఫినిక్స్ నుంచి భారత్ మార్కెట్‌లోకి ఇటీవలే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ బడ్జెట్ రేంజ్ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దీంతోపాటు ఈ మోడల్ AI ఫీచర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని చెబుతోంది.
భారత్‌లో ఎప్పుడు :
ఇన్ఫినిక్స్ హాట్ 60i స్మా్ర్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో ఈ సంవత్సరం జులైలో అందుబాటులోకి వచ్చింది. భారత్ మార్కెట్లో త్వరలో లాంచ్ కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కచ్చితమైన విడుదల తేదీ వెల్లడి కాకపోయినా.. ఈ నెల చివర్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నాలుగు కలర్ వేరియంట్స్ :
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ షాడో బ్లూ, మాన్‌సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది.
రూ.10 వేల కంటే ఎక్కువ ధర :
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ సుమారుగా రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం జులై నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
గత నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ఫోన్ విడుదల :
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇన్ఫినిక్స్ హాట్ 60 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.10499 గా ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 తో పనిచేస్తోంది.
ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేతమైన AI బటన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్, AI Writing Assistant వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
ఈ ఫోన్ కస్టమైజ్ AI బటన్ ద్వారా 30 యాప్స్‌ను సౌకర్యంగా వినియోగించుకోవచ్చు. ఈ బటన్‌ను Long Press చేసి ఇన్ఫినిక్స్ AI వాయిస్ అసిస్టెంట్ Folax ను యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఫోన్ XBoost AI గేమ్ మోడ్, HyperEngine 5.0 Lite గేమింగ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.
ప్రత్యేక ఫీచర్ :
ఈ ఇన్ఫినిక్స్ అల్ట్రాలింక్ కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్నా లేదా పూర్తిగా నెట్‌వర్క్ కవరేజీ లేకపోయినా ఈ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా ఇన్ఫినిక్స్ టూ ఇన్ఫినిక్స్ ఫోన్‌లకే కాల్స్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








