రూ.8999 ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AI ఫీచర్‌లతో 5G స్మార్ట్‌ఫోన్!
Infinix Hot 60i 5G Smartphone : ఇన్ఫినిక్స్ హాట్ 60 సిరీస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. హాట్ 60i 5G పేరుతో మరో హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్ లో ఈ హ్యండ్‌సెట్ విడుదల అయింది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, మీడియాటెక్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు 50MP కెమెరాతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ లను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.75 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. మరియు Mali g75 GPU ను కూడా కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 128GB eMMC స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 5.1 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, AI కాల్ ట్రాన్స్‌లేషన్, AI రైటింగ్ అసిస్టెంట్, AI Eraser, AI వాల్‌పేపర్ జనరేటర్, AI Summarisation వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. Folax అసిస్టెంట్ ను కూడా కలిగి ఉంది.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో బ్యాటరీ ఆకట్టుకొనే అవకాశం ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కలర్ వేరియంట్స్ :
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ షాడో బ్లూ, మాన్‌సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ (Infinix Hot 60i 5G Sale Date)4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9299 గా ఉంది. బ్యాంకు కార్డులతో రూ.8999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








