Home
Mobile

రూ.9 వేల ధరకే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AI ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్.. సేల్‌ ప్రారంభం..!

Infinix Hot 60i 5G Smartphone Sale : భారత్‌ లో ఎంట్రీ, బడ్జెట్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్‌ ఉంటోంది. అందువల్ల ఈ ధరలో అనేక సంస్థలు ఫోన్‌లను లాంచ్‌ చేస్తోన్నాయి. అయితే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఇటీవల రూ.10 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్‌ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఎంట్రీ లెవల్ ధరలోనూ 6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ :
ఇన్ఫినిక్స్ హాట్‌ 60i 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ధర రూ.9299 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు రిటైల్‌ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.300 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Infinix Hot 60i 5G sale

ప్రారంభ ధర రూ.8999 :
ఫలితంగా ఫోన్‌ను రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. షాడో బ్లూ, మాన్‌సూన్‌ గ్రీన్‌, ప్లమ్‌ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది. ఎంట్రీ ధరలో 5G ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ మోడల్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ను ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

6000mAh భారీ బ్యాటరీ :
ఇన్ఫినిక్స్ హాట్‌ 60i 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 670 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Infinix Hot 60i 5G sale

మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. Mali g75 GPU ను కూడా అమర్చి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB eMMC స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్‌ సింగిల్‌ స్టోరేజీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

50MP కెమెరా :
ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 5.1 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్‌గా ఉంది.

Infinix Hot 60i 5G sale

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో సర్కిల్‌ టూ సెర్చ్‌, AI Call Translation, AI Writing Assistant, AI Wallpaper Generator, AI Eraser తోపాటు AI Folax అసిస్టెంట్‌ ను కూడా కలిగి ఉంది. IR బ్లాస్టర్‌ ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 60i 5G Smartphone with 6000mAh battery sale is live on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X