Home
Mobile

రూ.8,999 ధరకే 6.6-inch డిస్‌ప్లే,5000mAh బ్యాటరీ ఫోన్ సేల్ నేడే!!! త్వరపడండి...

ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు నేడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మరోసారి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో అమ్మకానికి వచ్చినప్పటి నుండి కేవలం ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తున్నది. ఫ్లాష్ సేల్ పద్దతిలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు రూ .8,999 ధర వద్ద లభించే ఇన్ఫినిక్స్ హాట్ 9 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో

ఇండియాలో మే నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో ఫోన్‌తో పాటుగా ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 6.6-అంగుళాల డిస్ప్లే మరియు 5,000mAh బ్యాటరీతో రూ.10,000 ధరల విభాగంలో లభించే ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరికొత్త ఆండ్రాయిడ్ సంస్కరణను కూడా అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ధర మరియు సేల్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ధర మరియు సేల్ ఆఫర్స్

వైలెట్ మరియు ఓషన్ వేవ్ వంటి రెండు కలర్ వేరియంట్లలో లభించే 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ యొక్క ధర రూ.8,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ లావాదేవీల మీద 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే రూపే డెబిట్ కార్డు యొక్క మొదటి ప్రీపెయిడ్ లావాదేవీపై వినియోగదారులు రూ.30 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ 6.6-ఇంచ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ 6.6-ఇంచ్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్‌ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10-ఆధారిత XOS 6.0 ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్‌ 6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లేని 720x1600 పిక్సెల్ పరిమాణంలో 20: 9 కారక నిష్పత్తి మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియోతో వస్తుంది. ఇది IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 క్వాడ్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 క్వాడ్ కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో నిలువుగా సమలేఖనం పద్దతిలో అమర్చబడి ఉంటాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ లైట్ సెన్సార్లను కలిగి ఉన్నాయి. కెమెరా యొక్క ఫీచర్లలో కస్టమ్ బోకె, AI HDR మరియు AI 3D బ్యూటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫోన్‌ ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ 5,000mAh బ్యాటరీ కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ 5,000mAh బ్యాటరీ కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ యొక్క వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్రంట్ ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది బ్లూటూత్ V5, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, USB OTG, వోవైఫై మరియు మైక్రో యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. బోర్డులో సెన్సార్లలో జి-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, సామీప్య సెనర్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లు DTS సరౌండ్ సౌండ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది  ఒక ఛార్జ్ మీద 30 గంటల టాక్‌టైమ్, 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ మరియు 19 రోజుల స్టాండ్‌బై సమయం వరకు వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 9 Flash Sale in India Starts Today via Flipkart at 12 PM: Price, Specs and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X