Home
Mobile

బడ్జెట్ ధరలో 6.6-inch డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా ఫీచర్ ఫోన్ సేల్ నేడే!!! త్వరపడండి...

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న "బిగ్ సేవింగ్ డేస్" యొక్క అమ్మకాలు అంత్య దశకు వచ్చాయి. ఈ అమ్మకం సమయంలో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌ల యొక్క కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభించే ఇన్ఫినిక్స్ హాట్ 9 యొక్క అమ్మకం మీద కూడా బ్రహ్మాండమైన ఆఫర్లను అందిస్తున్నాయి. 5,000mAh బ్యాటరీ, 6.6 అంగుళాల డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 ధర మరియు సేల్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ధర మరియు సేల్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత అమ్మకంలో వైలెట్ మరియు ఓషన్ వేవ్ వంటి రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.9,499. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ లావాదేవీల మీద 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI నెలకు రూ.1,056 నుండి ప్రారంభమవుతుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 IPS డిస్ప్లే  

ఇన్ఫినిక్స్ హాట్ 9 IPS డిస్ప్లే  

ఇన్ఫినిక్స్ హాట్ 9 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్‌ (నానో) స్లాట్ ను కలిగి ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 10-ఆధారిత XOS 6.0 ద్వారా రన్ అవుతాయి. ఈ ఫోన్‌ 720x1600 పిక్సెల్స్ పరిమాణంలో 6.6-అంగుళాల హెచ్‌డి + హోల్-పంచ్ LCD IPS డిస్ప్లేని 20: 9 కారక నిష్పత్తి మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ-రేషియోతో 480 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. IMG PowerVR GE8320 GPU మరియు 4GB RAM తో జత చేసిన 2.0GH హెలియో పి 22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో ఇవి పనిచేస్తాయి. ఇంటర్నల్ స్టోరేజ్ 64GB వద్ద ఉన్నాయి. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 256GB వరకు మరింత విస్తరించడానికి వీలుకల్పిస్తుంది.

ఇన్ఫినిక్స్ హాట్ 9 16MP క్వాడ్ కెమెరా సెటప్ & ఇమేజ్ సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 16MP క్వాడ్ కెమెరా సెటప్ & ఇమేజ్ సెన్సార్

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ వెనుకభాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో నిలువుగా సమలేఖనం పద్దతిలో అమర్చబడి ఉంటాయి. ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రోలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా , 16మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇవి తక్కువ లైట్ సెన్సార్లను కూడా కలిగి ఉన్నాయి. ఇందులో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది. కెమెరా యొక్క ఫీచర్లలో కస్టమ్ బోకె, AI HDR మరియు AI 3D బ్యూటీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫోన్‌లో ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరు మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ముందు భాగంలో స్క్రీన్ యొక్క ఎడమవైపున గల పంచ్-హోల్ లోపల ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మోడ్లలో AI పోర్ట్రెయిట్, AI 3D ఫేస్ బ్యూటీ, వైడ్-సెల్ఫీ మరియు AR అనిమోజీ ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 9 5,000mAh బ్యాటరీ కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 5,000mAh బ్యాటరీ కనెక్టివిటీ

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది  ఒక ఛార్జ్ మీద 30 గంటల టాక్‌టైమ్, 130 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్ మరియు 19 రోజుల స్టాండ్‌బై సమయం వరకు వస్తుంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్రంట్ ఫేస్ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది బ్లూటూత్ V5, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, USB OTG, వోవైఫై మరియు మైక్రో యుఎస్బి పోర్ట్ ఉన్నాయి. బోర్డులో సెన్సార్లలో జి-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, సామీప్య సెనర్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్లు DTS సరౌండ్ సౌండ్‌కు మద్దతు ఇస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Hot 9 Flash Sale Live on Flipkart Big Saving Sale 2020 Last Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X