షియోమికి షాక్, ఒకేసారి 3 ఫోన్లతో..
షియోమికి ధీటుగా మరో కంపెనీ ఇండియా మార్కెట్లోకి రానుంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇన్ఫినిక్స్ అనే కంపెనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలిసింది.
షియోమికి ధీటుగా మరో కంపెనీ ఇండియా మార్కెట్లోకి రానుంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఇన్ఫినిక్స్ అనే కంపెనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలిసింది. ఈ కంపెనీకి చెందిన మోడల్స్‌ను అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో అమ్మకానికి ఉంచనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ల టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఈ కంపెనీకి చెందిన టీజర్ ను #GoBeyond హ్యాష్‌టాగ్ పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో ఉంచారు. దీని ప్రకారం 'జీరో 4, జీరో 4 ప్లస్, నోట్ 4' పేరిట మూడు ఫోన్లను మొదట విడుదల చేస్తుందని తెలిసింది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఇన్ఫినిక్స్ జీరో 4 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో తదితర ఫీచర్లు ఉండనున్నట్టు సమాచారం.

జీరో 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
5.98 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్‌డిస్‌ప్లే, 2.1 గిగాహెడ్జ్ డెకా కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 20, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 4 ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉండనున్నట్టు తెలిసింది.

అచ్చం షియోమీ ఫోన్లను
అతి త్వరలోనే ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈఫోన్లకు చెందిన డిజైన్ అచ్చం షియోమీ ఫోన్లను పోలి ఉండడం విశేషం.

ధరల విషయానికొస్తే
వీటి ధరల విషయానికొస్తే జీరో 4 ధర రూ. సుమారు రూ. 19వేలు, జీరో 4 ప్లస్ ధర రూ. 23 వేలుగానూ ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








