Home
Mobile

రూ.18 వేల‌లో, 108 మెగాపిక్సెల్ కెమెరా Smartphone.. లాంచ్ ఎప్పుడంటే!

Infinix కంపెనీ భారతదేశంలో కొత్త Infinix Note 12 సిరీస్ కు సంబంధించిన మ‌రో Smartphone ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Infinix Note 12 Pro 4G మోడ‌ల్‌ను ఆగస్టు 26 న దేశంలో కంపెనీ లాంచ్ చేయ‌వ‌చ్చ‌ని ఒక నివేదిక పేర్కొంది.

Infinix Note 12 Pro 4G

ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ద్వారా అందించబడుతుందని కంపెనీ గతంలో టీజ్ ద్వారా వెల్ల‌డించింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఈ smartphone తయారీ కంపెనీ ఇటీవల వనిల్లా Infinix Note 12 5Gని, Note 12 ప్రో 5G ల‌ను భారతదేశంలో Mediatek Dimensity 810 5G SoC ప్రాసెస‌ర్‌తో ఆవిష్క‌రించింది.

Infinix Note 12 Pro 4G లీక్డ్ తేదీ, ధ‌ర‌లు:

Infinix Note 12 Pro 4G లీక్డ్ తేదీ, ధ‌ర‌లు:

MySmartPrice నివేదిక ప్రకారం, Infinix భారతదేశంలో Infinix Note 12 Pro 4Gని ఆగస్టు 26న విడుదల చేయనుంది. Infinix Note 12 Pro 5G భారతదేశంలో రూ.17,999 గా నిర్ణ‌యించారు.. కాబ‌ట్టి, ఈ కొత్త 4G వేరియంట్ ధ‌ర‌ రూ.15,000 ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇది ఆల్పైన్ వైట్, టుస్కానీ బ్లూ మరియు వోల్కానిక్ గ్రే రంగులలో రావచ్చని నివేదిక పేర్కొంది. భారతదేశంలో Infinix Note 12 Pro ని ప్రారంభించే ప్రణాళికలకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి వివరాలను ప్రకటించలేదు.

Infinix Note 12 Pro 4G లీక్డ్ స్పెసిఫికేష‌న్లు:

Infinix Note 12 Pro 4G లీక్డ్ స్పెసిఫికేష‌న్లు:

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది డిస్‌ప్లేపై వాట‌ర్ డ్రాప్ స్టైల్‌లో నాచ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G99 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది XOS 10.6 ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of RAM+256GB స్టోరేజీ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 108-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.75 అప‌ర్చ‌ర్‌తో వ‌స్తున్న ప్రైమ‌రీ కెమెరా ఈ మొబైల్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఇక మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి డెప్త్ లెన్స్‌, మ‌రొక‌టి ఏఐ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్ క‌లిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. Wi-Fi, బ్లూటూత్, హెడ్‌ఫోన్ పోర్ట్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. DTS టెక్నాలజీ ద్వారా మెరుగుపరచబడిన డ్యూయల్ స్పీకర్లను స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. మంచి గేమింగ్ అనుభవం కోసం 4D వైబ్రేషన్‌తో లీనియర్ మోటార్ టాక్టైల్ సిస్టమ్ కూడా ఉంది.

Infinix Hot 12 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Infinix Hot 12 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

కొత్త Infinix Hot 12 సున్నితమైన గేమింగ్ అనుభవం కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. Infinix స్మార్ట్‌ఫోన్‌కు మన్నికైన డబుల్-ఫ్లాగ్ ఎడ్జ్ డిజైన్‌ను కూడా తీసుకువచ్చింది. Infinix Hot 12 కొన్ని గేమ్-సెంట్రిక్ ఫీచర్లతో వచ్చే MediaTek Helio G85 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Infinix Hot 12 కు 4GB RAMని అందిస్తున్నారు.. అంతేకాకుండా, దీనిని మరో 3GB వరకు విస్తరించవచ్చు, మొత్తంగా 7GB వరకు RAMని అందజేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్‌కు మరింత అనువుగా ప‌ని చేస్తుంది.

బ్యాక్ సైడ్‌లో, Infinix Hot 12 మొబైల్‌కు క్వాడ్-LED ఫ్లాష్‌తో 50MP AI ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి 2MP సెకండరీ షూటర్ మరియు మ‌రొక‌టి AI-సపోర్టింగ్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా కూడా ఉంది.

Infinix Hot 12 మొబైల్ 64GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని కూడా కలిగి ఉంది, దీనిని 256GB వరకు విస్తరించవచ్చు. అదనంగా, Infinix Hot 12 మొబైల్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో జత చేయబడిన భారీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. Infinix మొత్తం ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచే DTS మద్దతుతో సినిమాటిక్ డ్యూయల్ స్పీకర్‌లను కూడా చేర్చింది. Infinix Hot 12 పైన XOS కస్టమ్ స్కిన్‌తో Android 12 ఓఎస్ ఆధారంగా ర‌న్ అవుతుంది. ఇది ఛార్జింగ్, Wi-Fi, బ్లూటూత్, GPS మరియు ఇతర వాటి కోసం USB టైప్-సి పోర్ట్ వంటి సాధారణ కనెక్టివిటీ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది.

Infinix Hot 12 ధ‌ర‌లు:

Infinix Hot 12 ధ‌ర‌లు:

Infinix Hot 12 ఒకే వేరియంట్‌లో కొనుగోలుదారుల‌కు అందుబాటులోకి రానుంది. భార‌త మార్కెట్లో 4GB ర్యామ్‌+ 64GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.9,499 గా నిర్ణ‌యించింది. కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్ ఆగస్టు 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది. కొనుగోలుదారులు ఎక్స్‌ప్లోరేటరీ బ్లూ, పోలార్ బ్లాక్, పర్పుల్ మరియు టర్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. Infinix Hot 12 ఇప్పుడు మంచి ఫీచ‌ర్ల‌తో రూ.10 వేల లోపు ధ‌ర‌లో అత్యంత ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 12 Pro 4G With MediaTek Helio G99 SoC Could Launch in India on August 26: Report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X