చైనా బ్రాండ్లకు థీటుగా కొత్త ఫోన్‌లు వచ్చేసాయ్

రూ.7,499కే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్..

|

హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Infinix రెండు శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ హాట్ ప్రో, నోట్ 4 మోడల్స్‌‌లో ఈ ఫోన్‌‌లు అందుబాటులో ఉంటాయి.

రూ.9000లోపే..

రూ.9000లోపే..

హాట్ 4 ప్రో మోడల్ ధర రూ.7,499. నోట్ 4 మోడల్ ధర రూ.8.999. భారీ డిస్‌ప్లేలతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ కెమెరా వంటి బలమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ ప్రో స్పెసిఫికేషన్స్...

ఇన్ఫినిక్స్ హాట్ ప్రో స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 64 బిట్ 1.3GHz మీడియాటెక్ MT6737 SoC, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్ 4.1, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

ఇన్ఫినిక్స్ నోట్ 4  స్పెసిఫికేషన్స్...

ఇన్ఫినిక్స్ నోట్ 4 స్పెసిఫికేషన్స్...

5.7 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ MT6753 SoC, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, 4300mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

ఆగష్టు 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో..

ఆగష్టు 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆగష్టు 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతాయి. అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్.. క్వార్ట్జ్ బ్లాక్, మ్యాజిక్ గోల్డ్, బోర్డియాక్స్ రెడ్, మిలాన్ బ్లాక్, ఛాంపేన్ గోల్డ్, ఐస్ బ్లు

Best Mobiles in India

English summary
Infinix Note 4 and Hot 4 Pro launched in India at Rs. 7,499 and Rs.8,999. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X