6.78 అంగుళాల డిస్‌ప్లే, 108MP కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదలకానుందంటే?
ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note 40 5G Smartphone) భారత్‌లో విడుదల తేదీని సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే పిలిప్పెన్స్‌లో లాంచ్ అయింది. ఇదే తరహా వెర్షన్ భారత్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో జూన్ 21న విడుదల చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G మోడళ్లు ఏప్రిల్‌లో భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్ సన్నని బెజిల్స్‌ను కలిగి ఉంటుంది.
ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు పంచ్ హోల్ డిజైన్‌లో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఒబ్సిడియన్ బ్లా్క్, టైటాన్ గోల్డ్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు..
ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 93.8 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో తో లాంచ్ కానుంది.
ఈ హ్యాండ్‌సెట్ 15W వైర్‌లెస్ Mag Charge సపోర్టు మరియు 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ JBL తో కూడిన ఆడియో సపోర్టుతో రానుంది. అయితే భారత్ వేరియంట్ ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్‌ఫోన్ మిగిలిన స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే పిలిప్పెన్స్‌లో విడుదల అయింది. ఈ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB LPDDRX ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. దీంతోపాటు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 పైన పనిచేస్తుంది.
కెమెరాల పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP+ 2MP కెమెరాలతో లాంచ్ కానుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా రానుంది.
** ఏప్రిల్ నెలలో భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 కస్టమ్ స్కిన్‌ను కలిగి ఉంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W వైర్‌లెస్ MagCharge ను సపోర్టు చేస్తుంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 26 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications