Home
Mobile

256GB స్టోరేజీ, 108MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ ధరలో వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో లాంచ్‌..!!

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో 5G, ఇన్ఫినిక్స్‌ నోట్‌ ప్రో + హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యాయి. ప్రస్తుతం బేస్‌ వేరియంట్‌ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 108MP ప్రధాన కెమెరా సహా 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W వైర్‌ మరియు 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ అనేక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note 40 5G Smartphone) 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2436*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ సహా 120Hz రీఫ్రెష్‌ రేట్, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది.

Infinix Note 40 5G Smartphone sale

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14 OS ను కలిగి ఉంది. మరియు ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. అయితే అదనంగా 8GB ర్యామ్‌ను 16GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 108MP కెమెరా సహా మరో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. నాలుగు ఫ్లాష్‌ యూనిట్‌లను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం రెండు ఫ్లాష్‌ యూనిట్లతోపాటు 32MP కెమెరాను అమర్చారు. AI ఆధారిత Halo లైటింగ్‌ వ్యవస్థను కలిగి ఉంది. దీని ద్వారా నోటిఫికేషన్‌లు, ఛార్జింగ్‌, గేమింగ్‌ మోడ్‌ సహా మ్యూజిక్‌ వంటివి గమనించవచ్చు.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ 33W వైర్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్‌ల పరంగా బ్లూటూత్‌, వైఫై, OTG, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టులను కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.19,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్ల ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.17990 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్‌ల ద్వారా రూ.2000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్‌ను జూన్‌ 26 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.1999 విలువైన Magpad ను ఉచితంగా పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఒబ్సిడియన్‌ బ్లాక్ మరియు టైటాన్‌ గోల్డ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Infinix Note 40 5G Smartphone launched in india with wireless charging support
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X