Home
Mobile

108MP కెమెరా, 6.78 అంగుళాల 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. ధర, ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ల వివరాలు..!!

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఇటీవల లాంచ్ అయింది. ఇవాళ్టి నుంచి ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు (Infinix Note 40 5G Smartphone sale) చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 108MP ప్రధాన కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. టైటాన్‌ గోల్డ్‌, ఒబ్సిడియన్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ఫ్లిప్‌కార్ట్‌ ధర రూ.19,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్ ధర రూ.15,999 గా ఉండనుంది!.

infinix Note 40 5G Smartphone started on Flipkart

దీంతోపాటు నో కాస్ట్‌ EMI ఆఫర్‌లో భాగంగా నెలవారీ రూ.1333 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మరియు లిమిటెడ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఇన్ఫినిక్స్‌ నోట్ 40 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.1,999 విలువైన Magpad ను పొందవచ్చు. స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు.. :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్ 2436*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

infinix Note 40 5G Smartphone started on Flipkart

ఈ స్మార్ట్‌ఫోన్‌ 108MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 3x జూమింగ్‌ సామర్థ్యంతో 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందువైపు 32MP కెమెరాను అమర్చారు. మరియు రెండు ఫ్లాష్‌ యూనిట్‌ను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారి ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్‌ యాక్టివ్‌ Halo లైటింగ్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. కాల్స్‌, మెసేజ్‌, ఛార్జింగ్ స్టేటస్‌, మ్యూజిక్‌, యాప్‌ అలర్ట్‌ నోటిఫికేషన్‌ను తెలియజేస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. అదనంగా 8GB ర్యామ్‌ను 16GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14 OS ను కలిగి ఉంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

నోట్‌ 40 5G స్మార్ట్‌ఫోన్ 33W వైర్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్‌ల పరంగా Wi-Fi, బ్లూటూత్‌, GPS, OTG, USB-C ఛార్జింగ్‌ పోర్టులను కలిగి ఉంటుంది. IP53 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
infinix Note 40 5G Smartphone sale is live on Flipkart specs offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X