Home
Mobile

108MP కెమెరా, 8 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. తక్కువధరకే వైర్‌లెస్‌ ఛార్జింగ్!

ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా నోట్‌ 40 ప్రో 5G సిరీస్‌ను (Infinix Note 40 Pro 5G) లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ప్రో, ప్రో+ మోడళ్లు విడుదల అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మరియు 120Hz రీప్రెష్‌ రేట్‌తో వచ్చింది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 108MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో, ప్రో+ హ్యాండ్‌సెట్‌లు సుమారుగా ఒకేతరహా స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే బ్యాటరీ, ఛార్జింగ్‌ సపోర్టులో మాత్రమే మార్పులు ఉన్నాయి. ఈ రెండు వేరియంట్‌లు 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2160Hz PWM డిమ్మింగ్, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.

Infinix Note 40 Pro 5G smartphone specs

ఈ ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G, నోట్‌ 40 ప్రో + స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOS 14 కస్టమ్‌ స్కిన్‌ పైన పనిచేస్తుంది. మరియు 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌లు ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, స్టీరియో స్పీకర్లు, IP53 రేటింగ్‌తో లాంచ్‌ అయింది.

మరియు కెమెరా పరంగా ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. OIS సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

Infinix Note 40 Pro 5G smartphone specs

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ప్రో+ మోడల్‌ 100W ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ అయింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 20W వైర్‌లెస్‌ MagCharge సపోర్టు చేస్తాయి. ఫలితంగా రూ.25 వేల కంటే తక్కువ ధరకే వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్న హ్యాండ్‌సెట్‌లుగా గుర్తింపు పొందాయి.

యాక్టివ్‌ హేలో AI లైటింగ్‌ మరియు JBL సౌండ్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇన్ఫినిక్స్‌ సొంతంగా అభివృద్ధి చేసిన Cheetah X1 చిప్‌తో వస్తుంది. ఫలితంగా ప్రో+ మోడల్‌ హైపర్‌ మోడ్‌లో కేవలం 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేస్తుంది. అదే బేస్‌ మోడల్‌ 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 26 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేస్తుంది.

Infinix Note 40 Pro 5G smartphone specs

ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో 5G 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21999 గా ఉంది. ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24999గా ఉంది. HDFC, SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఒబ్సిడియన్‌ బ్లాక్‌, టైటాన్‌ గోల్డ్‌, వింటేజ్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఎర్లీ బర్డ్‌ సేల్ కూడా ప్రారంభం అయింది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రోను కొనుగోలు చేస్తే రూ.4999 విలువైన MagKit ను ఉచితంగా పొందవచ్చు. ఇందులో మాగ్నటిక్‌ వైర్‌లైస్‌ ఛార్జింగ్‌ కేస్‌ మరియు 3020mAh మెగ్‌పవర్‌ ఛార్జర్‌ బ్యాంకు ఉంటుంది. అయితే దీంతోపాటు MagPad (15W వైర్‌లెస్‌ ఛార్జర్‌) ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 40 Pro 5G series launched in india with 108MP OIS camera and wireless charging
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X