Home
Mobile

108MP కెమెరా, 6.78 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్‌, సేల్‌ వివరాలు..!

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు (Infinix Note 40 Pro 5G Series) భారత్‌లో త్వరలో విడుదల కానున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ టీజర్‌ ఆధారంగా ఈ సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు ఏప్రిల్‌ నెలలో లాంచ్ కానున్నాయి. ఇందుకు సంబంధించి టీజర్‌ బుధవారం విడుదల అయింది. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5G మరియు నోట్‌ 40 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్లు ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ వెబ్‌సైట్‌లో X6851B మోడల్‌ నంబర్‌తో కనిపించింది. దీని ద్వారా భారత్‌లో ఫోన్‌ విడుదలను ధ్రువీకరించినట్లు అయింది. ఈ రెండు ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 పైన పనిచేస్తాయి.

Infinix Note 40 Pro 5G Series smartphones launch date

ఈ ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు.. 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుంది. మరియు ఈ ఫోన్లు ఇన్ఫినిక్స్ ఫాస్ట్‌ ఛార్జ్‌ 2.0 టెక్నాలజీ పైన పనిచేస్తాయి. దీంతోపాటు 20W వైర్‌లెస్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది.

108MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా : ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 3x జూమ్‌, OIS ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో 108MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరో రెండు కెమెరాలుంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం : ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ సంస్థకు చెందిన Cheetah 1 చిప్‌ తో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 100W వైరడ్‌ ఛార్జింగ్‌, 20W వైర్‌లెస్‌ మెగ్‌ఛార్జ్‌ టెక్నాలజీ పైన పనిచేస్తుంది. అదేవిధంగా ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో 5G మోడల్‌ 45W వైరడ్‌ ఛార్జింగ్‌, 20W వైర్‌లెస్‌ మెగ్‌ఛార్జ్‌ టెక్నాలజీతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ల ధర! : ఇన్ఫినిక్స్ నోట్‌ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర $289 (భారత కరెన్సీ ప్రకారం రూ.24,000), అదే ప్రో మోడల్‌ ధర $309 (భారత కరెన్సీ ప్రకారం రూ.25,000) గా ఉంది. ఈ సిరీస్‌ ఫోన్‌ వచ్చే నెలలో భారత్‌లో విడుదల కానున్నాయి. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 40 Pro 5G Series smartphones confirmed to launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X