ధర రూ.20,000 కంటే తక్కువ ధరకే 108MP కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్.. సేల్ వివరాలు..!!
ఇన్ఫినిక్స్ నుంచి ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్ ఫోన్ (Infinix Note 40 Pro 5G Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను ఫ్లిప్‌కార్ట్ లో బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తున్న తక్కువ ధర హ్యాండ్‌సెట్‌గా గుర్తింపు పొందింది. రూ.20,000 కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ హ్యాండ్‌సెట్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 గా ఉంది. HDFC, ICICI, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చంజీ చేయడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 కస్టమ్ స్కిన్‌ను కలిగి ఉంది. రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు పొందవచ్చని సంస్థ హామి ఇచ్చింది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W వైర్‌లెస్ MagCharge ను సపోర్టు చేస్తుంది. తక్కువ ధరకే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్న హ్యాండ్‌సెట్‌గా ఈ ఫోన్ గుర్తింపు పొందింది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 26 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేస్తుంది.
కెమెరా పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ కెమెరాను కలిగి ఉంది. ముందువైపు 32MP కెమెరాను అమర్చారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IP53 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, యాక్టివ్ హేలో AI లైటింగ్ మరియు JBL సౌండ్ ఫీచర్లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications







