108MP కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, 256GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్..!
భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note 40 Pro 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 108MP ప్రైమరీ కెమెరా. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. మరియు భారీ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వారంటీని కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ధర తగ్గింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.2000 డిస్కౌంట్ :
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో ధర రూ.21999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.16999 గా ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని ఇన్ఫినిక్స్ తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
108MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ MagCharge సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. తక్కువ ధరలో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉన్న హ్యాండ్‌సెట్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5G గుర్తింపు పొందింది. మరియు 45W చార్జర్‌తో కేవలం 26 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. యాక్టివ్ హాలో AI లైటింగ్, మెరుగైన సౌండ్ కోంస JBL సపోర్టుతో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








