108MP కెమెరా, 256GB స్టోరేజీ 5G స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్ సేల్ ప్రారంభం... ఫీచర్‌లు, సేల్ ఆఫర్లు..!!
ఇన్ఫినిక్స్ తన ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ (Infinix Note 40 Pro Series Racing Edition sale) విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్ లో భాగంగా నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో ప్లస్ అందుబాటులో ఉంది. ఫార్ములా వన్ రేసింగ్ ప్రేరేపిత డిజైన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 108MP ప్రైమరీ కెమెరా మరియు కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. అదే నోట్ 40 ప్రో ప్లస్ రేసింగ్ ఎడిషన్ ప్లస్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో కలిపి ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ రేసింగ్ ఎడిషన్ సిరీస్ స్పెసిఫికేషన్ లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ రేసింగ్ ఎడిషన్ సిరీస్ లోని రెండు మోడళ్లు 6.78 అంగుళాల పుల్ HD+ కర్వడ్ LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చాయి. వచ్చింది.
రేసింగ్ ఎడిషన్ సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoC చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 అంతర్గత స్టోరేజీతో జతచేయబడింది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఈ రెండు మోడళ్లు కూలింగ్ టెక్నాలజీ 2.0 ను కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ సిరీస్ 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP + 2MP లెన్స్ లతో విడుదల అయింది. సెల్ఫీ, వీడియో కాల్స్ ఈ రెండు మోడళ్లు కూడా 32MP కెమెరాలను కలిగి ఉంది. బేస్ వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ, ప్రో ప్లస్ మోడల్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ రేసింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ల ఛార్జింగ్ నిర్వహణ కోసం Cheetah X1 చిప్‌సెట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు JBL ఆధారిత డ్యూయల్ స్పీకర్‌లతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ రేసింగ్ ఎడిషన్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ సిరీస్ IP53 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








