Home
Mobile

108MP కెమెరా, 6.78 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే, 256GB స్టోరేజీతో స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌..!

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 సిరీస్‌ రేసింగ్ ఎడిషన్‌ భారత్‌లో (Infinix Note 40 pro series Racing Edition Smartphone) లాంచ్‌ అయింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత్‌లో ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో ప్లస్ విడుదల అయ్యాయి. అయితే ఈ కొత్త ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ F1 ప్రేరేపిత డిజైన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 108MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్‌ LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో సిరీస్‌ రేసింగ్‌ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌లు స్టాండర్డ్‌ మోడల్‌ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్ LTPS అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.

Infinix Note 40 pro series Racing Edition sale date announced

కెమెరా విభాగం పరంగా రేసింగ్‌ ఎడిషన్‌ సిరీస్‌ 108MP ప్రైమరీ కెమెరా సహా 2MP+ 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో, నోట్‌ 40 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 32MP కెమెరాలను కలిగి ఉంది. తక్కువ ధరలోనే మెరుగైన కెమెరాలను కలిగి ఉంది.

ఈ రేసింగ్ ఎడిషన్‌ సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఈ రెండు మోడళ్లు 2.0 కూలింగ్‌ టెక్నాలజీ 2.0 ను కలిగి ఉంటుంది. థర్మల్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుస్తుంది.

Infinix Note 40 pro series Racing Edition sale date announced

ఈ హ్యాండ్‌సెట్‌ రేసింగ్‌ ఎడిషన్‌ బేస్‌ వేరియంట్ 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కలిగి ఉంటుంది. అదే ప్రో ప్లస్‌ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. బేస్‌ వేరియంట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది. అదే ప్రో ప్లస్‌ మోడల్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌ సెట్‌ సమర్థవంతమైన ఛార్జింగ్‌ నిర్వహణ కోసం Cheetah X1 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు 20W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు JBL ఆధారిత డ్యూయల్‌ స్పీకర్‌లతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ రేసింగ్ ఎడిషన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ సిరీస్‌ IP53 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

ఇన్ఫినిక్స్‌ నోట్ 40 ప్రో సిరీస్‌ ధర :
నోట్‌ 40 ప్రో రేసింగ్ ఎడిషన్‌ కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది. అదే ప్రో ప్లస్ మోడల్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీతో అందుబాటులో ఉంది.

ఈ మోడల్‌ ధర రూ.18999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కలిగి ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 26 నుంచి ఫ్లి్ప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 40 pro series Racing Edition Smartphone launched in india sale date announced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X