Home
Mobile

108MP కెమెరా, 20W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో స్మార్ట్‌ఫోన్.. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్..

ఇన్ఫినిక్స్‌ నుంచి ఈ సంవత్సరం మార్చి నెలలో నోట్ 40 సిరీస్‌ విడుదల అయింది. ఇందులో భాగంగా ఇన్ఫినిక్స్‌ నోట్ 40 5G, నోట్ 40 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40S 4G స్మార్ట్‌ఫోన్‌ (Infinix Note 40s 4G Smartphone) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. తాజాగా ఇన్ఫినిక్స్‌ వెబ్‌సైట్‌ నుంచి ఈ 4G హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ 5G ఫోన్ల తరహాలోనే డిజైన్ సహా Halo AI లైటింగ్‌ రింగ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ 40S 4G స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ 3D కర్వడ్‌ LTPS అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2436 పిక్సల్ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 550 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

Infinix note 40s 4G Smartphone specifications and features confirmed in india

ఇన్ఫినిక్స్‌ నోట్ 40 తరహాలోనే 6nm మీడియాటెక్‌ హీలియో G99 అల్టిమేట్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB LPDDR4x ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 14 XOS 14 పైన పనిచేస్తుంది. రెండు OS అప్‌గ్రేడ్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

స్టాండర్డ్‌ మోడల్‌ తరహాలోనే ఇన్ఫినిక్స్‌ నోట్ 40S 4G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉండనుంది. 108MP ప్రధాన కెమెరా సహా 2MP మ్యాక్రో కెమెరాతో అందుబాటులోకి రానుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్‌ 4G మోడల్‌ 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ 20W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు మరియు Magkit టెక్నాలజీతో రానుంది. అదే విధంగా బ్లూటూత్‌, వైఫై, 4G LTE, NFC, GPS మరియు USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంటుంది. JBL ఆధారిత డ్యూయల్ స్పీకర్లు, IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.

ఇన్ఫినిక్స్ సంస్థ వెబ్‌సైట్‌ ఆధారంగా త్వరలో అందుబాటులోకి రానున్న 4G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు కెమెరాలతోపాటు Halo AI లైటింగ్‌ రింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ నోట్‌ 40S 4G స్మార్ట్‌ఫోన్‌ ఒబ్సిడియన్‌ బ్లాక్‌ మరియు వింటేజ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర, విడుదల తేదీపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix note 40s 4G Smartphone key specifications confirmed expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X