144Hz కర్వ్డ్ డిస్‌ప్లే, 64MP సోనీ కెమెరా, 45W ఛార్జింగ్‌తో Infinix Note 50s 5G+ విడుదల.. ధర ఎంతంటే..
Infinix Note 50s 5G+: తాజాగా ఇన్ఫినిక్స్ (Infinix) సంస్థ తమ సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ను భారతదేశంలో విడుదల చేసింది. కేవలం రూ.15,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఫోన్, స్టైల్, పనితీరులో అదరగొడుతోంది. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్, అదిరిపోయే 64MP సోనీ కెమెరా, కళ్లు చెదిరే 144Hz కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి.
ఈ ధరలో ఇన్ని ఫీచర్లు అందించడం నిజంగా విశేషం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నోట్ 50 సిరీస్‌కు ఈ ఫోన్ ఒక ప్రీమియం ఎంపికగా నిలుస్తుంది. 5G ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని ఇన్ఫినిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీని ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

* చూడగానే ఆకట్టుకునే డిజైన్, డిస్‌ప్లే
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్-HD+ 3D కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఉంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. 10-బిట్ కలర్ డెప్త్, 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్‌తో రంగులు ఎంతో సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి.
స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంది. ఈ ఫోన్ కేవలం 7.6mm మందంతో సన్నగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్‌తో వస్తున్న అత్యంత సన్నని ఫోన్ ఇదే కావడం విశేషం. అంతేకాదు, IP64 రేటింగ్ ఉంది. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ పటిష్టత కూడా దీని సొంతం.
* వేగవంతమైన పనితీరు, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్‌లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ వాడారు. దీనికి తోడుగా 8GB LPDDR5X RAM (అవసరమైతే మరో 8GB వరకు వర్చువల్ RAM పెంచుకోవచ్చు) ఇచ్చారు. దీనివల్ల రోజువారీ పనులు, గేమింగ్ వంటివి చాలా సులభంగా, వేగంగా చేయవచ్చు. మాలి-G615 GPU తో గరిష్టంగా 90fps వరకు గేమింగ్ ఆస్వాదించవచ్చు.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, కిడ్స్ మోడ్, పీక్ ప్రూఫ్ వంటి ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని హామీ ఇస్తోంది.
* అద్భుతమైన కెమెరా, స్మార్ట్ ఫీచర్లు
దీని వెనుక వైపు 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రధాన కెమెరా, దానికి తోడుగా 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. దీనితో 4K రిజల్యూషన్‌లో 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో డ్యూయల్ వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉంది.
AI వాల్‌పేపర్ జనరేటర్, AIGC మోడ్, AI ఎరేజర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, వాతావరణం చెప్పడం, కెమెరా కంట్రోల్ చేయడం వంటి పనుల్లో సాయపడే ఫోలాక్స్ (Folax) స్మార్ట్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో నోటిఫికేషన్లు, కెమెరా వాడకం సమయంలో వెలిగే యాక్టివ్ హాలో లైటింగ్ మరో ప్రత్యేక ఆకర్షణ.
* పవర్ ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే సౌండ్ క్వాలిటీ
ఈ ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఆల్-రౌండ్ ఫాస్ట్‌ఛార్జ్ 3.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 60 నిమిషాల్లోనే 0-100% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బైపాస్ ఛార్జింగ్ (ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా నేరుగా పవర్ ఇవ్వడం), 10W రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లూ ఉన్నాయి.
* మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్
ఆడియో అనుభూతి కోసం ఆడియో బ్రాండ్ JBL సౌజన్యంతో ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో సపోర్ట్, స్పష్టమైన కాల్స్ కోసం డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లోని మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్ ఒక ప్రత్యేక ఆకర్షణ. దీని వెనుక భాగం వేగన్ లెదర్‌తో తయారైంది, ఇందులో మైక్రోఎన్‌క్యాప్సులేషన్ టెక్నాలజీ వాడారు.
దీనివల్ల ఫోన్ వాడే కొద్దీ నెమ్మదిగా ఒక మంచి సువాసన వెలువడుతుంది. ఈ సువాసనలో సముద్రపు తాజాదనం, నిమ్మకాయ (టాప్ నోట్స్), లిల్లీ ఆఫ్ ది వ్యాలీ పువ్వులు (మిడిల్ నోట్స్), అంబర్, వెటివర్ (బేస్ నోట్స్) వంటి పరిమళాలు ఉంటాయి.
* ధర, లభ్యత
ఈ బ్లూ కలర్ కాకుండా, మెటాలిక్ ఫినిషింగ్‌తో వచ్చే రూబీ రెడ్, టైటానియం గ్రే రంగులలో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ.15,999, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 17,999
ఈ ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా, అన్ని బ్యాంక్ ఆఫర్లను కలుపుకొని కొనుగోలుదారులు ఈ ఫోన్‌ను రూ.14,999 ప్రత్యేక ధరకు పొందవచ్చు.


Click it and Unblock the Notifications








