రూ.14999 కే 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, ఆకట్టుకొనే కలర్ లో 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ ఫోన్ కొత్త వేరియంట్ విడుదల అయింది. తాజాగా మైస్టిక్ ప్లమ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, బుర్గుండి రెడ్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఇన్ఫినిక్స్ నోట్ 50s మైస్టిక్ ప్లస్ కలర్ వేరియంట్ (Infinix Note 50s 5G+ Smartphone Mystic Plum Edition) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఈ కొత్త వేరియంట్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ కొత్త కలర్ వేరియంట్ ప్రీమియం వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు MIL -STD -810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది.
64MP కెమెరా, 5500mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ 64MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం JBL ట్యూనింగ్ తో కూడిన స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
* ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.9299 గా ఉంది. షాడో బ్లూ, మాన్‌సూన్ గ్రీన్, ప్లమ్ రెడ్, స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో ఈ హ్యాండ్‌సెట్ లభిస్తోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 5.1 పైన పనిచేస్తోంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్‌గా ఉంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications