రూ.14999 కే 64MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీ, 8GB ర్యామ్ 5G స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ నుంచి నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ ( Infinix Note 50s 5G Smartphone ) విడుదల అయింది. ప్రస్తుతం రూ.15 వేల ధర రేంజ్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్, మెటాలిక్ ఫినిష్ ను కలిగి ఉంది. దీంతోపాటు 144Hz రీప్రెష్ రేట్ ను కలిగి ఉంది. 64MP కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
విడుదల సమయంలో ధరలు :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లి్ప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్ :
ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం గ్రే, మెరైన్ డ్రిఫ్ట్, బుర్గుండీ రెడ్ వంటి మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
3D కర్వడ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల FHD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో అందుబాటులో ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

64MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ AI Eraser, AI వాల్ పేపర్ జనరేటర్, Polax AI అసిస్టెంట్ ను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ 90fps ఫ్రేమ్ రేట్ ను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్ తో వాటర్, డస్ట్ రేటింగ్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








